‘మావోయిస్టులతో చర్చలు జరపాలి’

మావోయిస్టులతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే చర్చలు జరపాలని పౌరహక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలుకా చంద్రశేఖర్‌ డిమాండ్‌ చేశారు.  దండకారణ్యంలో ఆదివాసీలపై మారణహోమాన్ని నిలిపివేయాలని కోరారు.

Published : 27 May 2024 04:21 IST

మాట్లాడుతున్న చంద్రశేఖర్‌. చిత్రంలో వివిధ సంఘాల నాయకులు

విజయవాడ(గాంధీనగర్‌), న్యూస్‌టుడే: మావోయిస్టులతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే చర్చలు జరపాలని పౌరహక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలుకా చంద్రశేఖర్‌ డిమాండ్‌ చేశారు.  దండకారణ్యంలో ఆదివాసీలపై మారణహోమాన్ని నిలిపివేయాలని కోరారు. ఆదివారం విజయవాడ ప్రెస్‌ క్లబ్‌లో నిర్వహించిన రౌండ్‌టేబుల్‌ సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఆపరేషన్‌ కగాన్‌ పేరుతో మావోయిస్టు ఉద్యమాన్ని అణచివేయాలని చూడటం సరికాదన్నారు. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్ర అటవీ ప్రాంతంలో భద్రతా దళాలు ఎన్‌కౌంటర్‌ పేరుతో వంద మందికిపైగా మావోయిస్టులు, ఆదివాసీలను పట్టుకొని కాల్చి చంపడం దారుణమన్నారు. పరిస్థితులను పరిశీలించడానికి జర్నలిస్టులు, హక్కుల సంఘాలను అనుమతించకపోవడం... అక్కడ సహజ వనరులను పెట్టుబడిదారులకు కట్టబెట్టడానికేనని విమర్శించారు. సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి టి.ఆంజనేయులు మాట్లాడుతూ.. ఛత్తీస్‌గఢ్‌ అటవీ ప్రాంతంలో మారణహోమాన్ని పరిశీలించడానికి ప్రజాస్వామ్యవాదులకు అవకాశం కల్పించాలన్నారు. అక్కడ సాయుధ, మిలటరీ క్యాంపులను తక్షణమే ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో విరసం, పీడీఎం, సీపీఎం, ఓపీడీఆర్, కేవీపీఎస్‌ తదితర సంఘాల నాయకులు పాల్గొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని