తెలంగాణ సీఎం రేవంత్‌తో బాలకృష్ణ భేటీ

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ఆదివారం జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో సినీ నటుడు, బసవ తారకం ఇండో అమెరికన్‌ క్యాన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఛైర్మన్‌ బాలకృష్ణ మర్యాదపూర్వకంగా కలిశారు.

Updated : 27 May 2024 06:17 IST

ముఖ్యమంత్రి రేవంత్‌కు పుష్పగుచ్ఛం అందిస్తున్న బాలకృష్ణ

ఈనాడు, హైదరాబాద్‌: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ఆదివారం జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో సినీ నటుడు, బసవ తారకం ఇండో అమెరికన్‌ క్యాన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఛైర్మన్‌ బాలకృష్ణ మర్యాదపూర్వకంగా కలిశారు. వివిధ అంశాలపై ఇరువురూ చర్చించుకున్నారు. బాలకృష్ణతో పాటు బసవ తారకం ఇండో అమెరికన్‌ క్యాన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌ సీఈవో డాక్టర్‌ కె.కృష్ణయ్య, బసవతారకం ఆసుపత్రి ట్రస్ట్‌ బోర్డు సభ్యులు జేఎస్‌ఆర్‌ ప్రసాద్‌ కూడా ఉన్నారు.

ముఖ్యమంత్రితో డాక్టర్‌ కె.కృష్ణయ్య, జేఎస్‌ఆర్‌ ప్రసాద్‌

నిమ్స్‌ వైద్య బృందానికి అభినందన

గిరిజన యువకుడు సోది నంద ఛాతీలో దిగిన బాణాన్ని చాకచక్యంగా తొలగించి అతని ప్రాణం కాపాడిన నిమ్స్‌ వైద్య బృందానికి సీఎం రేవంత్‌రెడ్డి అభినందనలు తెలిపారు. గిరిజన యువకుడికి నిమ్స్‌ వైద్యులు చేసిన శస్త్రచికిత్సపై ఆదివారం సీఎం ‘ఎక్స్‌’ వేదికగా స్పందించారు. ‘‘సామాన్య ప్రజల్లో నిమ్స్‌ దవాఖాన పట్ల ఉన్న నమ్మకాన్ని మరోసారి రుజువు చేశారు. భవిష్యత్‌లో మరింత విస్తృతంగా వైద్య సేవలు అందించి నిమ్స్‌ పేదల దేవాలయంగా పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు