అరాచక పాలన అంతం.. పురివిప్పిన ఆనందం!

వైకాపా ఓటమితో ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. గత ఐదేళ్లలో ఆ పార్టీ నాయకుల చేతుల్లో దాడులకు గురైనవారు, బాధిత కుటుంబ సభ్యులు రోడ్లపైకి వచ్చి ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Updated : 05 Jun 2024 05:24 IST

వైకాపా ఓటమితో ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. గత ఐదేళ్లలో ఆ పార్టీ నాయకుల చేతుల్లో దాడులకు గురైనవారు, బాధిత కుటుంబ సభ్యులు రోడ్లపైకి వచ్చి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రంలో కనిపిస్తున్న ఈమె పేరు కాళ్ల మధు. విజయనగరం జిల్లా కేంద్రంలోని అవనాపు వీధిలో నివాసముంటున్నారు. 2020లో ఈమె కుమారుడు కాళ్ల నారాయణరావుపై వైకాపా నాయకులు కత్తులతో దాడులకు దిగారు. వ్యక్తిగత కక్ష, వర్గపోరు కారణంగా దాడులు చేశారు. అప్పటి నుంచి మధు.. చంద్రబాబు సీఎం కావాలని దేవుళ్లకు మొక్కేవారు. కూటమి గెలవడంతో మంగళవారం ఇలా నడిరోడ్డుపైకి వచ్చి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. స్టెప్పులేసి.. బిగ్గరగా అరుస్తూ ఇలా విజయ గళం వినిపించారు.

న్యూస్‌టుడే, విజయనగరం పట్టణం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు