తెదేపా విజయం.. లండన్‌లో సంబరాలు

రాష్ట్రంలో ఎన్డీయే ఘన విజయం సాధించిన నేపథ్యంలో విదేశాల్లో స్థిరపడిన తెలుగువారు సంబరాలు చేసుకుంటున్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి నుంచి వరుసగా విజయోత్సవాలు నిర్వహిస్తున్నారు.

Published : 08 Jun 2024 06:24 IST

లండన్‌లో సోలీహాల్‌ వద్ద తెదేపా జెండాతో చెరుకూరి రాజా తదితరులు

హనుమాన్‌ జంక్షన్, న్యూస్‌టుడే: రాష్ట్రంలో ఎన్డీయే ఘన విజయం సాధించిన నేపథ్యంలో విదేశాల్లో స్థిరపడిన తెలుగువారు సంబరాలు చేసుకుంటున్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి నుంచి వరుసగా విజయోత్సవాలు నిర్వహిస్తున్నారు. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మడిచర్లకు చెందిన చెరుకూరి కనకయ్యచౌదరి కుమారుడు రాజా ఉద్యోగ రీత్యా లండన్‌లోనే ఉంటున్నారు. తెదేపా వీరాభిమానులైన వీరు.. స్నేహితులతో కలిసి లండన్‌లోని సోలీహల్‌ వద్ద సంబరాలు చేసుకున్నారు. మహిళలు జెండాలు చేతబూని, కేకులు కోస్తూ ఆనందాన్ని పంచుకున్నారు.

మహిళల సంబరాలు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని