‘పద్మ’ అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం

కేంద్ర ప్రభుత్వం.. 2025 గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటించే ‘పద్మ’ అవార్డుల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కృష్ణా, ఎన్టీఆర్‌ జిల్లాల యువజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యనిర్వహణాధికారి యు.శ్రీనివాసరావు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు.

Updated : 11 Jun 2024 05:57 IST

విజయవాడ క్రీడలు, న్యూస్‌టుడే: కేంద్ర ప్రభుత్వం.. 2025 గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటించే ‘పద్మ’ అవార్డుల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కృష్ణా, ఎన్టీఆర్‌ జిల్లాల యువజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యనిర్వహణాధికారి యు.శ్రీనివాసరావు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మశ్రీ అవార్డులకు దరఖాస్తు చేసే వారు పలు రంగాల్లో విశిష్ట సేవలు అందించి ఉండాలని పేర్కొన్నారు. కళలు, సాహిత్యం, విద్య, క్రీడలు, వైద్యం, సామాజిక/సాంఘిక సేవ, సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్, ప్రజా సంబంధాలు, సివిల్‌ సర్వీసులు, ట్రేడ్‌ అండ్‌ ఇండస్ట్రీ రంగాల్లో విశిష్ట సేవలందించినవారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని చెప్పారు. ప్రభుత్వ వెబ్‌సైట్‌ https://awards.gov.in ద్వారా వచ్చే నెల 18వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసిన వారు సదరు పూర్తి వివరాలను తమ కార్యాలయంలో ఒక హార్డ్‌ కాపీ సమర్పించడంతో పాటు కార్యాలయం మెయిల్‌ (dywokrishna@yahoo.co.in)కు ఒక సాఫ్ట్‌ ప్రతి కూడా పంపాలని తెలిపారు. మరిన్ని వివరాలకు www.padmaawards.gov.in  వెబ్‌సైట్‌ ను సంప్రదించాలన్నారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని