Gautam Adani: వచ్చే ఐదేళ్లలో 15-20 బిలియన్ డాలర్ల పెట్టుబడులు: గౌతమ్ అదానీ

దిల్లీ: అదానీ గ్రూప్ సంస్థల్లో రానున్న ఐదేళ్లలో 15-20 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ఆ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ వెల్లడించారు. వ్యాపార వృద్ధికి బలమైన బ్యాలెన్స్ షీటే నిదర్శనమని చెప్పారు. అదానీ ఎంటర్‌ప్రైజెస్ వార్షిక నివేదికలో ఈ మేరకు ఆయన ప్రస్తావించారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా అదానీ గ్రూప్ ఎప్పుడూ వెనక్కి తగ్గలేదని, సవాళ్లను స్వీకరిస్తూ ముందుకు సాగిందని తెలిపారు.
‘‘భారతదేశ ఆశయాలతో మన లక్ష్యాలు ముడిపడి ఉన్నాయి. మన నమ్మకానికి ఓ స్పష్టత ఉంది. వాటాదారులుగా మీరు మాపై ఉంచే నమ్మకం మాకు మరింత బలాన్నిస్తుంది. ప్రతీ సవాల్ మన సంకల్పానికి పదును పెడుతుంది. ప్రతి ఎదురుదెబ్బ అభివృద్ధికి సోపానంగా మారుతుంది. సత్యం కంటే అసత్యాలే తొందరగా వ్యాపిస్తున్నాయి. అలాంటి ప్రపంచంలో ప్రస్తుతం మనమంతా జీవిస్తున్నాం. మన చట్టాలు పకడ్బందీగా ఉన్నాయి. చట్టపరంగా మనం ముందుకు వెళ్తే ఎలాంటి సమస్యలు ఎదురుకావని నమ్ముతున్నా’’ అని అదానీ పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా..
 - 
                        
                            

అబుధాబి లాటరీలో రూ.60 కోట్లు గెలుచుకున్న భారతీయుడు
 - 
                        
                            

నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (04/11/2025)
 - 
                        
                            

భారత్ సాయంతోనే తిరుగుబాటు భగ్నం.. మాల్దీవులు మాజీ అధ్యక్షుడు
 - 
                        
                            

జులన్ గోస్వామిగా అనుష్కశర్మ.. బయోపిక్ విడుదలకు సరైన సమయమిదే!
 - 
                        
                            

ఆ క్షణాలు ఇంకా వెంటాడుతున్నాయి: ఎయిరిండియా ప్రమాద మృత్యుంజయుడు
 


