Gautam Adani: అలా చేస్తే భార్య పారిపోతుంది: వర్క్‌-లైఫ్ బ్యాలెన్స్‌పై అదానీ ఆసక్తికర వ్యాఖ్యలు

Eenadu icon
By Business News Team Published : 01 Jan 2025 00:08 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

దిల్లీ: అభివృద్ధి చెందిన దేశాల సరసన భారత్‌ చేరాలంటే యువత వారానికి 70 గంటల చొప్పున పని చేయాలని ఇన్ఫోసిస్‌ (Infosys) సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి (Narayana Murthy) గతంలో వ్యాఖ్యానించారు. దీనిపై పలువురు వ్యాపారవేత్తలు, ప్రముఖులు తమ అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. తాజాగా ఇదే అంశంపై అదానీ గ్రూప్‌ అధినేత గౌతమ్ అదానీ (Adani Group chairman Gautam Adani) ఆసక్తికర వ్యాఖ్యలుచేశారు. ఈ మేరకు ఓ మీడియా సంస్థతో మాట్లాడారు.

‘‘వర్క్‌-లైఫ్ బ్యాలెన్స్‌ విషయంలో మీరు అనుసరిస్తోన్న విధానాలను ఇతరులపై రుద్దొద్దు. కొందరు నాలుగు గంటలు కుటుంబానికి సమయం వెచ్చించి ఆనందాన్ని పొందుతారు. మరొకరి ఆలోచన వేరేలా ఉంటుంది. అది వారి బాలెన్స్‌. పనిలోనే నిమగ్నమైపోతే.. భార్య పారిపోతుంది. మీకు నచ్చిన పనులు చేస్తే మీ జీవితంలో సమతుల్యత ఉంటుంది. కుటుంబం, ఉద్యోగం ఇవే మనకు ప్రపంచం. పిల్లలు కూడా మన నుంచి ఇవే విషయాలు గమనించి, ఆచరిస్తుంటారు. ఇక్కడ ఎవరూ శాశ్వతంగా ఉండిపోవడానికి రాలేదు. ఆ విషయం అర్థమైనప్పుడు మన జీవితం సరళంగా మారుతుంది’’ అని అదానీ (Gautam Adani) అన్నారు.

గతంలో ఓ పాడ్‌కాస్ట్‌లో నారాయణమూర్తి మాట్లాడుతూ.. ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్‌లో ఉత్పాదకత తక్కువని అన్నారు. అందుకే దేశ యువత మరిన్ని గంటలు అధికంగా శ్రమించాలన్నారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జపాన్‌, జర్మనీ వంటి దేశాలు ఎలాగైతే కష్టపడ్డాయో.. మనమూ అలాగే పనిచేయాలని అన్నారు. అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడాలంటే భారత్‌లోని యువత వారానికి 70 గంటల పాటు పనిచేయాలని సూచించారు. దీనిపై మిశ్రమ స్పందనలు వ్యక్తమయ్యాయి. కొందరు ఉద్యోగ జీవితంలో ఉండే ఇబ్బందులను లేవనెత్తగా.. మరికొందరు బాస్‌లు మాత్రం నారాయణ మూర్తి అభిప్రాయాన్ని స్వాగతించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు