Artificial Intelligence: కృత్రిమ మేధపై వ్యయాలు మూడింతలు

మన దేశంలో కృత్రిమ మేధ (ఏఐ)పై వ్యయాలు 2027 నాటికి మూడింతలు పెరిగి 5 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.41,500 కోట్ల)కు చేరొచ్చని ఇంటెల్‌-ఐడీసీ నివేదిక వెల్లడించింది.

Published : 20 May 2024 01:37 IST

2027 నాటికి రూ.41,500 కోట్లకు చేరొచ్చు
ఇంటెల్‌-ఐడీసీ నివేదిక

దిల్లీ: మన దేశంలో కృత్రిమ మేధ (ఏఐ)పై వ్యయాలు 2027 నాటికి మూడింతలు పెరిగి 5 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.41,500 కోట్ల)కు చేరొచ్చని ఇంటెల్‌-ఐడీసీ నివేదిక వెల్లడించింది. 2023లో దేశీయ సంస్థలు 1,703.8 మిలియన్‌ డాలర్ల (సుమారు రూ.14,000 కోట్ల)ను ఏఐపై వెచ్చించాయని నివేదిక పేర్కొంది. 2023-27 మధ్య భారత్‌లో ఏఐ వ్యయాలు 31.5% వార్షిక సమ్మిళిత వృద్ధి రేటు (సీఏజీఆర్‌)తో 5 బి.డాలర్లకు చేరతాయ’ని ఐడీసీ అసోసియేట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ శరత్‌ శ్రీనివాసమూర్తి పేర్కొన్నారు. 2023లో ప్రధానంగా 209 మి.డాలర్ల వ్యయం మౌలిక సదుపాయాలు, సంబంధిత సాఫ్ట్‌వేర్‌ కోసం వెచ్చించినట్లు అంచనా వేశారు. ఆగ్‌మెంటెడ్‌ కస్టమర్‌ సర్వీస్‌ ఏజెంట్లపై 168.8 మి.డాలర్లు, డిజిటల్‌ అసిస్టెన్స్‌పై 113.1 మి.డాలర్లు, ఆగ్‌మెంటెడ్‌ థ్రెట్‌ ఇంటెలిజెన్స్‌పై 100.1 మి.డాలర్లు, ప్రోగ్రామ్‌ అడ్వైజర్స్‌ రెకమెండేషన్‌ సిస్టమ్స్‌పై 97.1 మి.డాలర్లు ఖర్చు చేశారని వివరించారు. అంతర్జాతీయంగా అతి పెద్ద మూడో ఏఐ విపణిగా మన దేశం ఉందని, ఇప్పటికే 20% డేటా ఇక్కడ ఉత్పత్తి అవుతోందని ఇంటెల్‌ ఇండియా రీజియన్‌ వైస్‌ ప్రెసిడెంట్, ఎండీ సంతోష్‌ విశ్వనాథన్‌ వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని