Bharti Airtel: ఎయిర్‌టెల్‌ నుంచి కొత్త తరహా సిమ్‌కార్డ్‌లు

Bharti Airtel: వర్జిన్‌ ప్లాస్టిక్‌ సిమ్‌ కార్డ్‌ల నుంచి రీసైకిల్డ్‌ పీవీసీ సిమ్‌ కార్డ్‌లకు మారే దిశగా టెలికాం సంస్థ భారతీ ఎయిర్‌టెల్‌ అడుగులు వేసింది.

Updated : 28 Feb 2024 19:46 IST

Bharti Airtel | ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రముఖ టెలికాం సంస్థ భారతీ ఎయిర్‌టెల్‌ (Bharti Airtel) పర్యావరణ హిత సిమ్‌కార్డ్‌లను తీసుకురానుంది. ఇప్పటివరకు వినియోగిస్తున్న వర్జిన్‌ ప్లాస్టిక్‌ సిమ్‌ కార్డ్‌లకు స్వస్తి పలకనుంది. ఇకపై రీసైకిలింగ్‌కు అనుకూలంగా ఉండే పీవీసీ సిమ్‌ కార్డ్‌లకు మారుతున్నట్లు ప్రకటించింది. ఈమేరకు IDEMIA సెక్యూర్ ట్రాన్సాక్షన్స్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు బుధవారం తెలిపింది. హరిత ఉద్గారాలను తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. 

గూగుల్‌ మ్యాప్స్‌లో కొత్త ఫీచర్‌.. లాక్‌స్క్రీన్‌లో డైరెక్షన్స్‌

ఈ నిర్ణయంతో రీసైకిల్డ్‌ పీవీసీ సిమ్‌ కార్డ్‌ల దిశగా అడుగువేసిన మొదటి టెలికాం సంస్థగా ఎయిర్‌టెల్‌ నిలిచింది. ‘మేం తీసుకున్న ఈ నిర్ణయంతో వర్జిన్‌ ప్లాస్టిక్‌ ఉత్పత్తి 165 టన్నులకే పరిమితం అవుతుంది. ఏడాదిలో 690 టన్నులకు సమానమైన CO2 విడుదల కాకుండా ఆపడానికి వీలు పడుతుంది. భారత్‌ తన నెట్‌ జీరో లక్ష్యాన్ని చేరుకోవడంలో ఒక బ్రాండ్‌గా తమ వంతు కాలుష్యాన్ని తగ్గించడానికి కృషి చేస్తున్నాం’ అని భారతీ ఎయిర్‌టెల్‌ సప్లయ్‌ చైన్‌ డైరెక్టర్‌ పంజ్‌ మిగ్లానీ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని