LPG Price Cut: వాణిజ్య వంటగ్యాస్‌ సిలిండర్‌ ధర తగ్గింపు

LPG Price Cut: గత మార్చిలో వాణిజ్య సిలిండర్‌ ధరను పెంచిన ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు ఈనెల కుదించాయి.

Published : 01 Apr 2024 10:06 IST

దిల్లీ: హోటళ్లు, రెస్టారంట్లు సహా వాణిజ్య అవసరాల కోసం వాడే వంటగ్యాస్‌ ధరను ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు తగ్గించాయి. దేశ రాజధాని దిల్లీలో 19 కిలోల సిలిండర్‌ ధర రూ.30.50 తగ్గి రూ.1,764.50కు చేరింది. రాష్ట్రాలను బట్టి ఈ తగ్గింపులో మార్పు ఉంటుంది. పట్నాలో గరిష్ఠంగా ఒక్కో సిలిండర్‌పై రూ.33 వరకు తగ్గింది. హైదరాబాద్‌లో రూ.32.50 తగ్గి రూ.1,994.50కు, విశాఖపట్నంలో రూ.32 తగ్గి రూ.1,826.50కు చేరింది. కొత్త ధరలు నేటి నుంచే అమల్లోకి రానున్నాయి. మరోవైపు ఐదు కిలోల ఫ్రీ ట్రేడ్‌ ఎల్‌పీజీ ధరను సైతం రూ.7.50 తగ్గించారు.

మార్చి 1న వాణిజ్య వంటగ్యాస్‌ ధరను ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు పెంచిన విషయం తెలిసిందే. ఒక్కో సిలిండర్‌పై రూ.25 మేర పెంచాయి. ప్రతినెలా 1వ తేదీన గ్యాస్‌ ధరలను కంపెనీలు సవరిస్తుంటాయి. అంతర్జాతీయ మార్కెట్లోని ధరలకు అనుగుణంగా మార్పులు చేస్తుంటాయి. ఈసారి లోక్‌సభ ఎన్నికలకు ముందు తగ్గింపు నిర్ణయం వెలువడటం ప్రాధాన్యం సంతరించుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని