Sanchar Saathi mobile app: సంచార్‌ సాథీ మొబైల్‌ యాప్‌ విడుదల.. మోసపూరిత కాల్స్‌కు చెక్‌

Eenadu icon
By Business News Team Updated : 17 Jan 2025 20:25 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

Sanchar Saathi mobile app | దిల్లీ: మోసపూరిత కాల్స్‌/ సందేశాలకు చెక్‌ పెట్టేందుకు టెలికాం శాఖ కొత్తగా సంచార్‌ సాథీ (Sanchar Saathi) మొబైల్‌ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. కేంద్ర టెలికాం శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింథియా ఈ యాప్‌ను శుక్రవారం విడుదల చేశారు. అనుమానిత కాల్స్‌ వచ్చినప్పుడు మొబైల్ ఫోన్‌ లాగ్‌ నుంచే నేరుగా ఫిర్యాదు చేయడం, మొబైల్‌ ఫోన్‌ బ్లాక్‌ వంటి సదుపాయాలు ఇందులో ఉన్నాయి. తొలుత సంచార్‌ సాథీ పోర్టల్‌ను 2023లో కేంద్ర టెలికాం శాఖ అందుబాటులోకి తెచ్చింది. మొబైల్‌ యాప్‌ను లాంచ్‌ చేయడం ద్వారా మరింత సమర్థంగా మోసాలకు చెక్‌ పెట్టొచ్చని కేంద్రం భావిస్తోంది. ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌లో ఈ యాప్‌ వినియోగించొచ్చు.

సంచార్‌ సాథీ ఫీచర్లు ఇవే..

  • అనుమానిత కాల్స్‌/ ఎస్సెమ్మెస్‌లు వచ్చినప్పుడు కాల్ లాగ్‌ నుంచే నేరుగా ఫిర్యాదు చేయొచ్చు.
  • మీ పేరు మీద ఎన్ని మొబైల్‌ కనెక్షన్లు ఉన్నాయో తెలుసుకోవచ్చు. మీ పేరు మీద అనధికారికంగా ఏవైనా నంబర్లు ఉంటే ఫిర్యాదు చేయొచ్చు.
  • మొబైల్‌ పోయినప్పుడు, దొంగతనానికి గురైనప్పుడు బ్లాక్‌ చేసే సదుపాయం ఇందులో ఉంది.
  • మొబైల్‌ ఫోన్‌ ప్రామాణికతను కూడా యాప్‌ సాయంతో గుర్తించొచ్చు. ఇందుకోసం ఐఎంఈఐ నంబర్‌ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సెకండ్‌ హ్యాండ్‌ మొబైల్‌ కొనుగోలు చేసేటప్పుడు ఈ ఫీచర్‌ ఉపయోపడుతుంది.

Tags :
Published : 17 Jan 2025 19:58 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు