ఆ 4 రంగాలపైనే ఎఫ్‌ఐఐల చూపు

వడ్డీరేట్ల పెంపులో అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ నెమ్మదిస్తుందనే అంచనాల మధ్య, విదేశీ సంస్థాగత మదుపర్లు (ఎఫ్‌ఐఐలు) మన ఈక్విటీల్లో మళ్లీ భారీగా పెట్టుబడులు పెడుతున్నారు.

Published : 27 Nov 2022 06:55 IST

రూ.20,000 కోట్ల పెట్టుబడులు

డ్డీరేట్ల పెంపులో అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ నెమ్మదిస్తుందనే అంచనాల మధ్య, విదేశీ సంస్థాగత మదుపర్లు (ఎఫ్‌ఐఐలు) మన ఈక్విటీల్లో మళ్లీ భారీగా పెట్టుబడులు పెడుతున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి 10 నెలల్లో వారు రూ.1,38,000 కోట్లకు పైగా పెట్టుబడుల్ని వెనక్కి తీసుకున్న సంగతి విదితమే. ఈ నెలలో మళ్లీ వారు నికర కొనుగోలుదార్లుగా మారుతున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. నవంబరు తొలి 15 రోజుల్లో రూ.28,888 కోట్ల పెట్టుబడులను మన మార్కెట్లలోకి ఎఫ్‌ఐఐలు తరలించారు. ఇందులో   రూ.20,000 కోట్లు కేవలం 4 రంగాల షేర్లలోకే వెళ్లాయని ఎన్‌ఎస్‌డీఎల్‌ డేటా చెబుతోంది. ఇందులో రూ.11,452 కోట్లు ఒక్క ఆర్థిక సేవల రంగంలోకే వెళ్లాయి. తర్వాత స్థానంలో ఎఫ్‌ఎంసీజీ రంగం ఉంది. అంత క్రితం పక్షంతో పోలిస్తే ఈ రంగంలోకి 7 రెట్లు పెట్టుబడులు పెరిగి రూ.3,514 కోట్లకు చేరాయి. ఐటీ, వాహన రంగాల షేర్లలోకి వరుసగా రూ.3,005 కోట్లు, 2,251 కోట్ల పెట్టుబడులు వెళ్లాయి.

* ఇదే సమయంలో మన్నికైన వినిమయ వస్తువులు, టెక్స్‌టైల్స్‌ రంగాల షేర్లను ఎఫ్‌ఐఐలు విక్రయించారు. గతంతో పోలిస్తే స్థిరాస్తి షేర్లలో విక్రయాలు నెమ్మదించాయి. విద్యుత్‌ రంగంలో నికర విక్రేతలుగా ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని