క్రాంప్టన్‌ గ్రీవ్స్‌ కన్జూమర్‌ ఎలక్ట్రికల్స్‌-బటర్‌ఫ్లై విలీనం

క్రాంప్టన్‌ గ్రీవ్స్‌ కన్జూమర్‌ ఎలక్ట్రికల్స్‌ లిమిటెడ్‌ (సీజీసీఈఎల్‌), బటర్‌ఫ్లై గాంధిమథి అప్లియెన్సెస్‌ సంస్థలు విలీనం కాబోతున్నట్లు ప్రకటించాయి. షేర్ల మార్పిడి ద్వారా ఈ విలీనం జరుగుతుంది.

Published : 27 Mar 2023 01:57 IST

దిల్లీ: క్రాంప్టన్‌ గ్రీవ్స్‌ కన్జూమర్‌ ఎలక్ట్రికల్స్‌ లిమిటెడ్‌ (సీజీసీఈఎల్‌), బటర్‌ఫ్లై గాంధిమథి అప్లియెన్సెస్‌ సంస్థలు విలీనం కాబోతున్నట్లు ప్రకటించాయి. షేర్ల మార్పిడి ద్వారా ఈ విలీనం జరుగుతుంది. ఇది కార్పొరేట్‌, పాలనా నిర్మాణాన్ని సులభతరం చేస్తుందని, మాతృ స్థాయిలో బటర్‌ఫ్లై పబ్లిక్‌ వాటాదార్ల కలయికతో రెండు కంపెనీల వాటాదార్ల ప్రయోజనాలు సమం అవుతాయని ఇరు సంస్థలు సంయుక్త ప్రకటనలో తెలిపాయి. ఈ విలీనం ద్వారా రికార్డు తేదీ నాటికి బటర్‌ఫ్లై వాటాదార్లు ప్రతి 5 ఈక్విటీ షేర్లకు, 22 క్రాంప్టన్‌ గ్రీవ్స్‌ షేర్లను పొందుతారు. విలీనం తర్వాత బటర్‌ఫ్లై వాటాదార్లు సంయుక్త సంస్థలో 3 శాతం వాటా కలిగి ఉంటారు. ఈ విలీన పథకానికి నియంత్రణ సంస్థలు, స్టాక్‌    ఎక్స్ఛేంజ్‌లు, సెబీ, ఇరు కంపెనీల వాటాదార్లు, రుణదాతలు, ఎన్‌సీఎల్‌టీ (ముంబయి, చెన్నై బెంచ్‌లు) ఆమోదం తెలపాల్సి ఉంటుంది. 2022 ఫిబ్రవరిలో బటర్‌ఫ్లైలో 81 శాతం వాటాను రూ.2,076 కోట్లకు సీజీసీఈఎల్‌ కొనుగోలు చేసింది. తమిళనాడుకు చెందిన బటర్‌ఫ్లై గాంధిమథి అప్లియెన్సెస్‌ వంటశాల, చిన్న గృహోపకరణాలను తయారు చేస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని