అమెరికాలో గ్రాన్యూల్స్ ప్యాకేజింగ్ యూనిట్
అమెరికాలోని వర్జీనియాలో తమ అనుబంధ సంస్థ గ్రాన్యూల్స్ కన్జూమర్ హెల్త్ (జీసీహెచ్) ద్వారా ప్యాకేజింగ్ కేంద్రాన్ని గ్రాన్యూల్స్ ఇండియా ప్రారంభించింది.
హైదరాబాద్: అమెరికాలోని వర్జీనియాలో తమ అనుబంధ సంస్థ గ్రాన్యూల్స్ కన్జూమర్ హెల్త్ (జీసీహెచ్) ద్వారా ప్యాకేజింగ్ కేంద్రాన్ని గ్రాన్యూల్స్ ఇండియా ప్రారంభించింది. 79,000కు పైగా చదరపు అడుగుల్లో విస్తరించి ఉన్న ఈ కేంద్రంలో ప్యాకేజింగ్ లైన్స్, క్లీన్ రూమ్స్ వంటి సదుపాయాలు ఉన్నాయి. అమెరికా మార్కెట్‌లో ఎక్కడికైనా ఇక్కడి నుంచి ఔషధ ఉత్పత్తులను పంపొచ్చు. ఈ కేంద్రానికి ఇటీవల యూఎస్‌ఎఫ్‌డీఏ సున్నా అభ్యంతరాలతో అనుమతి లభించిందని గ్రాన్యూల్స్ తెలిపింది. అమెరికాలో భారత అంబాసిడర్‌గా ఉన్న తరణ్‌జిత్ సింగ్ సంధు ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. అమెరికా ఇండియా బిజినెస్ కౌన్సిల్ ప్రెసిడెంట్ అతుల్ కేషప్, సెలెక్ట్ యూఎస్‌ఏ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జస్జిత్ సింగ్, కన్జూమర్ హెల్త్‌కేర్ ప్రోడక్ట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ స్కాట్ మెల్విలే, ప్రిన్స్ విలియం కౌంటీ ఎగ్జిక్యూటివ్ క్రిస్ షార్టర్‌లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
1945 నుంచి.. ఆ చర్చిలో 927 మందిపై లైంగిక వేధింపులు!
-
World News
Imran Khan: ఇమ్రాన్ ఖాన్‌కు ఊరట.. ముందస్తు బెయిల్ గడువు పొడిగింపు
-
World News
జపాన్‌లో జన సంక్షోభం.. రికార్డు స్థాయిలో పడిపోయిన జననాలు!
-
Crime News
Train accident: కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం.. ఏపీలో హెల్ప్‌లైన్ నంబర్లు
-
Movies News
Vishwak Sen: అందుకే పేరు మార్చుకున్నా: విశ్వక్ సేన్
-
India News
Train Accident: రైలు ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని సహా పలువురు ప్రముఖుల దిగ్భ్రాంతి