Nirmala Sitharaman: నామినీల పేర్లను తప్పక తీసుకోండి: నిర్మలా సీతారామన్‌

భవిష్యత్‌లో క్లెయిము చేసుకోని నగదు సమస్య రాకుండా వినియోగదార్లకు చెందిన వారసుల(నామినీలు) పేర్లను తప్పకుండా తీసుకోవాలని బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సూచించారు.

Updated : 06 Sep 2023 09:29 IST

అన్‌క్లెయిమ్డ్‌ నగదు సమస్య రాకూడదు
బ్యాంకులకు ఆర్థిక మంత్రి సూచన

ముంబయి: భవిష్యత్‌లో క్లెయిము చేసుకోని నగదు సమస్య రాకుండా వినియోగదార్లకు చెందిన వారసుల(నామినీలు) పేర్లను తప్పకుండా తీసుకోవాలని బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సూచించారు. ‘బ్యాంకింగ్‌ వ్యవస్థతో పాటు మ్యూచువల్‌ ఫండ్‌లు, స్టాక్‌మార్కెట్లతో కూడిన ఆర్థిక సంస్థలు తమ వినియోగదార్ల వారసుల పేర్లు, చిరునామాలను తప్పనిసరిగా అప్‌డేట్‌ చేయాలి. భవిష్యత్‌లో ఎటువంటి సమస్యా రాకుండా చూసుకోవాల’ని గ్లోబల్‌ ఫిన్‌టెక్‌ ఫెస్ట్‌(జీఎఫ్‌ఎఫ్‌) కార్యక్రమంలో పేర్కొన్నారు. ఒక నివేదిక ప్రకారం.. బ్యాంకింగ్‌ వ్యవస్థలో రూ.35,000 కోట్లకు పైగా క్లెయిము చేసుకోని డిపాజిట్లు ఉన్నాయి. ఇక మొత్తం అన్‌క్లెయిమ్డ్‌ నగదు రూ.లక్ష కోట్లకు పైగానే ఉండొచ్చని అంచనా.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు