హోండా కార్ల ధరలూ పెరుగుతాయ్‌

జనవరి నుంచి తమ కార్ల ధరలను పెంచనున్నట్లు హోండా కార్స్‌ ఇండియా తెలిపింది. పెరిగిన తయారీ వ్యయాల భారాన్ని కంపెనీపై తగ్గించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ ఉపాధ్యక్షుడు (మార్కెటింగ్‌, విక్రయాలు) కునాల్‌ బెల్‌ వివరించారు.

Published : 04 Dec 2023 01:33 IST

దిల్లీ: జనవరి నుంచి తమ కార్ల ధరలను పెంచనున్నట్లు హోండా కార్స్‌ ఇండియా తెలిపింది. పెరిగిన తయారీ వ్యయాల భారాన్ని కంపెనీపై తగ్గించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ ఉపాధ్యక్షుడు (మార్కెటింగ్‌, విక్రయాలు) కునాల్‌ బెల్‌ వివరించారు. ప్రస్తుతం ఎలివేట్‌, సిటీ, అమేజ్‌ మోడల్‌ కార్లను సంస్థ దేశీయంగా విక్రయిస్తోంది. ఏ మోడల్‌ ధర ఎంత పెంచాలన్నది ఈ నెలాఖరున ఖరారు చేస్తామని కునాల్‌ బెల్‌ పేర్కొన్నారు. ఇటీవల ప్రవేశపెట్టిన ఎలివేట్‌కు ప్రకటించిన ప్రత్యేక ధర ఈనెల 23 వరకే వర్తిస్తుందని, జనవరి నుంచి కొత్త ధరలే ఈ కారుకూ వర్తిస్తాయని వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని