ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌లో వార్‌బర్గ్‌ పింకస్‌ 1.3 శాతం వాటా విక్రయం

ఐడీఎఫ్‌సీ బ్యాంక్‌లో అమెరికాకు చెందిన ప్రైవేటు ఈక్విటీ సంస్థ వార్‌బర్గ్‌ పింకస్‌ 1.3 శాతం వాటాను రూ.790.18 కోట్లకు విక్రయించింది. ఓపెన్‌ మార్కెట్‌ లావాదేవీ ద్వారా ఈ విక్రయం జరిగింది. ఈ వార్తలతో బీఎస్‌ఈలో ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌ షేరు 3.02 శాతం నష్టపోయి రూ.87.69 వద్ద ముగిసింది.

Published : 08 Dec 2023 01:29 IST

లావాదేవీ విలువ రూ.790 కోట్లు

దిల్లీ: ఐడీఎఫ్‌సీ బ్యాంక్‌లో అమెరికాకు చెందిన ప్రైవేటు ఈక్విటీ సంస్థ వార్‌బర్గ్‌ పింకస్‌ 1.3 శాతం వాటాను రూ.790.18 కోట్లకు విక్రయించింది. ఓపెన్‌ మార్కెట్‌ లావాదేవీ ద్వారా ఈ విక్రయం జరిగింది. ఈ వార్తలతో బీఎస్‌ఈలో ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌ షేరు 3.02 శాతం నష్టపోయి రూ.87.69 వద్ద ముగిసింది. మొత్తం 9,17,75,672 షేర్లను సరాసరిన రూ.86.10 చొప్పున వార్‌బర్గ్‌ పింకస్‌ విక్రయించింది. క్లోవర్‌డెల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ద్వారా ఐడీఎఫ్‌సీ బ్యాంక్‌లో వార్‌బర్గ్‌ పింకస్‌కు ఇంకా 2.74% వాటా ఉంది. సెప్టెంబరులో కూడా ఐడీఎఫ్‌సీ బ్యాంక్‌లో 4.2% వాటాను రూ.2,480 కోట్లకు ఓపెన్‌ మార్కెట్‌ లావాదేవీ ద్వారా వార్‌బర్గ్‌ పింకస్‌ విక్రయించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని