వివో కేసులో తొలి ఛార్జిషీట్‌ దాఖలు

చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ వివో అనుబంధ సంస్థ వివో ఇండియాపై, మనీలాండరింగ్‌ నిరోధక చట్టం కింద ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) ఛార్జిషీట్‌ దాఖలు చేసింది. వివోతో పాటు మరికొందరిపై వచ్చిన మనీలాండరింగ్‌ ఆరోపణలపై దర్యాప్తు చేసిన ఈడీ, తొలి ఛార్జిషీట్‌ను ప్రత్యేక కోర్టులో వేసింది. మనీలాండరింగ్‌ నిరోధక చట్టంలోని పలు సెక్షన్ల కింద వివో ఇండియాపై అభియోగాలు మోపింది.

Published : 08 Dec 2023 01:35 IST

దిల్లీ: చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ వివో అనుబంధ సంస్థ వివో ఇండియాపై, మనీలాండరింగ్‌ నిరోధక చట్టం కింద ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) ఛార్జిషీట్‌ దాఖలు చేసింది. వివోతో పాటు మరికొందరిపై వచ్చిన మనీలాండరింగ్‌ ఆరోపణలపై దర్యాప్తు చేసిన ఈడీ, తొలి ఛార్జిషీట్‌ను ప్రత్యేక కోర్టులో వేసింది. మనీలాండరింగ్‌ నిరోధక చట్టంలోని పలు సెక్షన్ల కింద వివో ఇండియాపై అభియోగాలు మోపింది. గతేడాది జులైలో వివో కార్యాలయాలు సహా సంబంధిత వ్యక్తుల నివాసాల్లో ఈడీ సోదాలు నిర్వహించింది. దేశంలో పన్ను ఎగవేత కోసం రూ.62,476 కోట్లను భారత్‌ నుంచి చైనాకు అక్రమంగా ఈ సంస్థ బదిలీ చేసిందన్నది ఈడీ ఆరోపణ. ఈ కేసులో లావా ఇంటర్నేషనల్‌ ఎండీ హరి ఓం రాయ్‌తో పాటు చైనాకు చెందిన గ్వాంగ్వెన్‌ అలియాస్‌ ఆండ్రూ కువాంగ్‌, సీఏలు నితిన్‌ గార్గ్‌, రాజన్‌ మాలిక్‌ను ఈడీ అదుపులోకి తీసుకుంది. దేశంలో ఆర్థిక సార్వభౌమత్వాన్ని దెబ్బ తీసే కుట్రగా ఈ ఘటనను ఈడీ అభివర్ణించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని