ద్రవ్యోల్బణం అదుపు.. ఇంకా పూర్తి కాలేదు

ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసే పని ఇంకా పూర్తి కాలేదని.. అందువల్ల వడ్డీరేట్ల పరంగా విధాన పరమైన చర్యలేమైనా తీసుకుంటే.. ఇప్పటిదాకా ధరల నియంత్రణ విషయంలో సాధించిన విజయాలు కనుమరుగవుతాయని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) గవర్నర్‌ శక్తికాంత దాస్‌ పేర్కొన్నారు.

Published : 23 Feb 2024 03:11 IST

ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌

ముంబయి: ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసే పని ఇంకా పూర్తి కాలేదని.. అందువల్ల వడ్డీరేట్ల పరంగా విధాన పరమైన చర్యలేమైనా తీసుకుంటే.. ఇప్పటిదాకా ధరల నియంత్రణ విషయంలో సాధించిన విజయాలు కనుమరుగవుతాయని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) గవర్నర్‌ శక్తికాంత దాస్‌ పేర్కొన్నారు. ఈ నెలలో జరిగిన పరపతి విధాన కమిటీ(ఎమ్‌పీసీ) సమావేశ వివరాల (మినిట్స్‌)ను ఆర్‌బీఐ గురువారం విడుదల చేసింది. ఆ వివరాల ప్రకారం.. ద్రవ్యోల్బణం ‘గమ్యస్థానం’ చేరేవరకు పరపతి విధానం విషయంలో అప్రమత్తంగా ఉంటామని దాస్‌ పేర్కొన్నారు. దీర్ఘకాలంలో అధిక వృద్ధిని కొనసాగించాలంటే ధరల అదుపుతో పాటు, ఆర్థిక స్థిరత్వం అవసరమన్నారు. వృద్ధికి విఘాతం కలగకుండా ద్రవ్యోల్బణాన్ని 4 శాతానికి పరిమితం చేయడంపై పరపతి విధానం దృష్టి సారిస్తుందని స్పష్టం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని