ఎయిర్‌టెల్‌ నుంచి ఇన్‌-ఫ్లైట్‌ రోమింగ్‌ పథకాలు

విమానాల్లో మొబైల్‌ సేవలు పొందేందుకు అనువైన ఇన్‌-ఫ్లైట్‌ రోమింగ్‌ పథకాలను ఎయిర్‌టెల్‌ ఆవిష్కరించింది.

Published : 23 Feb 2024 03:17 IST

హైదరాబాద్‌: విమానాల్లో మొబైల్‌ సేవలు పొందేందుకు అనువైన ఇన్‌-ఫ్లైట్‌ రోమింగ్‌ పథకాలను ఎయిర్‌టెల్‌ ఆవిష్కరించింది. విదేశాలకు వెళ్లే ప్రీపెయిడ్‌ వినియోగదారులు రూ.2,997 ఇంటర్నేషనల్‌ రోమింగ్‌ పథకంతో రీఛార్జి చేసుకుంటే 365 రోజుల కాలపరిమితి ఉంటుంది. వీరికి విమాన ప్రయాణంలో 24 గంటల పాటు వాడుకునేందుకు 250 ఎంబీ డేటా, 100 నిమిషాల కాల్స్‌, 100 ఎస్‌ఎంఎస్‌లు లభిస్తాయి.

  • పోస్ట్‌పెయిడ్‌ వినియోగదారులు రూ.3,999 ఇంటర్నేషనల్‌ రోమింగ్‌ పథకాన్ని యాక్టివేట్‌ చేసుకుంటే, విమానంలో పై సదుపాయాలే పొందొచ్చు. 
  • అంతర్జాతీయ రోమింగ్‌ పథకాలు తీసుకోని వారు కూడా, కనీస రీఛార్జి రూ.195 పథకంతో ఇన్‌ఫ్లైట్‌ సేవలు పొందొచ్చని కంపెనీ తెలిపింది. రూ.195తో 24 గంటల పాటు 250 ఎంబీ డేటా, 100 నిమిషాల ఔట్‌గోయింగ్‌, 100 ఎస్‌ఎంఎస్‌లను పొందొచ్చు. రూ.295 పథకంతో 500 ఎంబీ డేటా, 100 నిమిషాల కాల్స్‌, 100 ఎస్‌ఎంఎస్‌లు, రూ.595 పథకంతో  1 జీబీ డేటా, 100 నిమిషాల కాల్స్‌, 100 ఎస్‌ఎంఎస్‌లు పొందొచ్చు. వీటి కాలవ్యవధీ 24 గంటలని కంపెనీ తెలిపింది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని