ఆల్టెరో నుంచి ఐరోపా బ్రాండ్ల ఫర్నిచర్‌

ఐరోపా లగ్జరీ బ్రాండ్ల ఫర్నిచర్‌ విక్రయాలు ప్రారంభించినట్లు ఆల్టెరో అనే సంస్థ ప్రకటించింది.

Published : 01 Mar 2024 01:43 IST

ఈనాడు, హైదరాబాద్‌: ఐరోపా లగ్జరీ బ్రాండ్ల ఫర్నిచర్‌ విక్రయాలు ప్రారంభించినట్లు ఆల్టెరో అనే సంస్థ ప్రకటించింది. హైదరాబాద్‌లోని కావూరి హిల్స్‌లో 12,000 చదరపు అడుగుల భవనంలో తొలి స్టోర్‌ను ప్రారంభించామని, రూ.5 లక్షల నుంచి రూ.5 కోట్ల విలువైన ఇటలీ, స్పెయిన్‌, పోర్చుగల్‌, ఫ్రాన్స్‌, డెన్మార్క్‌ తదితర ఐరోపా దేశాల ప్రముఖ బ్రాండ్ల ఫర్నిచర్‌ను ఆర్డరుపై అందిస్తామని ఆల్టెరో ఎండీ చందన కోగంటి వివరించారు. వినియోగదార్ల అభిరుచులకు అనుగుణంగా తమ డిజైన్‌ నిపుణుల బృందం కస్టమైజ్డ్‌ ఫర్నిచర్‌ను రూపొందిస్తుందని తెలిపారు. త్వరలో దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో కొత్త స్టోర్లు ఏర్పాటు చేస్తామన్నారు. మనదేశంలో రూ.36,000 కోట్లకు పైగా ఉన్న లగ్జరీ ఫర్నిచర్‌ మార్కెట్‌, 2029 నాటికి రూ.44,400 కోట్లకు చేరుకునే అవకాశం ఉందని అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని