అనంత్‌ మాటలకు ముకేశ్‌ భావోద్వేగం

భారత సంపన్నుడు, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధిపతి ముకేశ్‌ అంబానీ చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ, రాధికా మర్చంట్‌ల ప్రీవెడ్డింగ్‌ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.

Published : 03 Mar 2024 01:45 IST

జామ్‌నగర్‌: భారత సంపన్నుడు, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధిపతి ముకేశ్‌ అంబానీ చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ, రాధికా మర్చంట్‌ల ప్రీవెడ్డింగ్‌ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తొలి రోజు ఈవెంట్‌లో అనంత్‌ మాట్లాడారు. ఈ సందర్భంగా తన ఆరోగ్య సమస్యల గురించి అనంత్‌ చెబుతుండగా ముకేశ్‌ భావోద్వేగంతో కంటతడి పెట్టుకున్నారు. ఈ ముందస్తు పెళ్లి వేడుకలను మరింత ప్రత్యేకంగా చేసేందుకు తన కుటుంబం చాలా కష్టపడిందని అనంత్‌ తెలిపారు. ‘‘నన్ను సంతోషంగా ఉంచేందుకు మా అమ్మ ఎంతో చేశారు. రోజుకు 18-19 గంటలు కష్టపడ్డారు.

ప్రీవెడ్డింగ్‌ ఈవెంట్‌ను ప్రత్యేకంగా చేసేందుకు రెండు నెలలుగా మా కుటుంబమంతా రోజుకు 3 గంటలే నిద్రపోయింది. మీ అందరికీ తెలుసు.. నా జీవితం పూర్తిగా పూలపాన్పు కాదు. ఎన్నో ముళ్లు గుచ్చుకున్న బాధనూ అనుభవించా. చిన్నప్పటి నుంచి చాలా ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నా. కానీ, ఆ బాధను మర్చిపోయేలా నా తల్లిదండ్రులు ఎల్లప్పుడూ అండగా నిలిచారు. అనుకున్నది సాధించేలా ప్రోత్సహించారు. వారికి నేనెప్పుడూ రుణపడి ఉంటా’’ అని చెప్పారు.  జామ్‌నగర్‌ వేదికగా ముందస్తు పెళ్లి వేడుకలు శుక్రవారం సాయంత్రం ప్రారంభమయ్యాయి.తొలి రోజు పాప్‌ సింగర్‌ రిహన్నాతో పాటు పలువురు ప్రదర్శనలిచ్చారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని