షియామీ ఎస్‌యూ7 ఈవీ

షియామీ తన తొలి విద్యుత్‌ కారు (ఈవీ) ఎస్‌యూ7ను (ఎస్‌యూ అంటే స్పీడ్‌ అల్ట్రా) గురువారం విడుదల చేసింది.

Published : 29 Mar 2024 01:20 IST

ధర రూ.24.90 లక్షలు

బీజింగ్‌: షియామీ తన తొలి విద్యుత్‌ కారు (ఈవీ) ఎస్‌యూ7ను (ఎస్‌యూ అంటే స్పీడ్‌ అల్ట్రా) గురువారం విడుదల చేసింది. దీని ధర 2,15,900 యువాన్లు (సుమారు రూ.24.90 లక్షలు)గా నిర్ణయించింది. టెస్లా, బీవైడీ సంస్థల కార్లను తట్టుకుని నిలబడేందుకు సరసమైన ధరనే ఈ స్పోర్టీ కారుకు నిర్ణయించినట్లు మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి. తొలుత దీని ధర 5,00,000 యువాన్ల (సుమారు రూ.58,00,000) వరకు ఉండొచ్చని అంచనా వేశారు. ఎస్‌యూ7 కార్లలో 4 వేరియంట్లను షియామీ విడుదల చేసింది. ఇందులో హై-పెర్ఫార్మెన్స్‌ మ్యాక్స్‌ వెర్షన్‌ కూడా ఉంది. ఎంట్రీ లెవల్‌ వెర్షన్‌, ప్రో వేరియంట్‌, లిమిటెడ్‌ ఫౌండర్స్‌ ఎడిషన్‌లు మిగతావి. స్పోర్టింగ్‌ స్లీక్‌ 4-డోర్‌ సెడాన్‌ డిజైన్‌తో ఈ కారును తీసుకొచ్చింది.

1.98 సెకన్లలో 100 కి.మీ. వేగం: మ్యాక్స్‌ వేరియంట్‌ 265 కి.మీ. గరిష్ఠ వేగంతో ప్రయాణిస్తుంది. కేవలం 2.78 సెకన్లలో 100 కి.మీ. వేగాన్ని అందుకోవడం దీని ప్రత్యేకత. ఒకసారి ఛార్జింగ్‌తో 819 కి.మీ. వరకు ప్రయాణించొచ్చు. లిమిటెడ్‌ ఫౌండర్స్‌ ఎడిషన్‌ డ్యూయెల్‌ మోటార్‌, 4-వీల్‌-డ్రైవ్‌ పవర్‌ట్రెయిన్‌, 986 బీహెచ్‌పీ పవర్‌తో రూపొందింది. కేవలం 1.98 సెకన్లలోనే ఇది 100 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది. ఎస్‌యూ7లలో బ్యాటరీల కోసం సీఏటీఎల్‌తో షియామీ ఒప్పందం చేసుకుంది. ఇందులో రెండు ఎంపికలున్నాయి. 73.6 కిలోవాట్‌ అవర్‌ ప్యాక్‌ను ప్రాథమిక వేరియంట్లకు వినియోగిస్తున్నారు. 101 కిలోవాట్‌ అవర్‌ ప్యాక్‌ను టాప్‌ మోడళ్లకు వాడుతున్నారు. ఈ బ్యాటరీలు ఒకసారి ఛార్జింగ్‌తో కనీసం 700 కి.మీ. ప్రయాణించేలా డిజైన్‌ చేశారు. 15 నిమిషాలు అల్ట్రా-ఫాస్ట్‌ ఛార్జింగ్‌తో 350-510 కి.మీ. ప్రయాణించేలా ఎస్‌యూ7లు రూపొందాయి.
నీ వచ్చే ఏడాది 150 కిలోవాట్‌ అవర్‌ పెద్ద బ్యాటరీని పరిచయం చేయాలని షియామీ భావిస్తోంది. ఇది జరిగితే ఒకసారి ఛార్జింగ్‌తో 1,200 కి.మీ. ప్రయాణించే అవకాశం లభిస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని