పీఎల్‌ఐ ఆధారిత రంగాల్లోకి రూ.1.06 లక్షల కోట్ల పెట్టుబడులు

ప్రభుత్వం 14 రంగాలకు ప్రకటించిన ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (పీఎల్‌ఐ) పథకాలు 2023 డిసెంబరు నాటికి రూ.1.06 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులను ఆకర్షించాయని అధికారిక గణాంకాలు వెల్లడించాయి.

Published : 01 Apr 2024 02:03 IST

ఔషధ తయారీలోకి అధికం

దిల్లీ: ప్రభుత్వం 14 రంగాలకు ప్రకటించిన ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (పీఎల్‌ఐ) పథకాలు 2023 డిసెంబరు నాటికి రూ.1.06 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులను ఆకర్షించాయని అధికారిక గణాంకాలు వెల్లడించాయి. ఇందులో ఔషధ, సౌర మాడ్యూళ్ల రంగాలే సగానికి పైగా పెట్టుబడులను రాబట్టాయి. ఐటీ, హార్డ్‌వేర్‌, వాహన, వాహన విడిభాగాలు, టెక్స్‌టైల్స్‌, ఏసీసీ బ్యాటరీ స్టోరేజ్‌ వంటి రంగాలకు స్పందన అంతంత మాత్రంగానే ఉంది. 2021లో ప్రభుత్వం టెలికమ్యూనికేషన్‌, మన్నికైన వినిమయ వస్తువులు, టెక్స్‌టైల్స్‌, వైద్య పరికరాల తయారీ, వాహన, స్పెషాల్టీ స్టీల్‌, ఆహార పదార్థాలు, అధిక సామర్థ్యం కలిగిన సౌర పీవీ మాడ్యూళ్లు, అడ్వాన్స్‌డ్‌ కెమిస్ట్రీ సెల్‌ (ఏసీసీ) బ్యాటరీ, డ్రోన్లు, ఔషధ వంటి 14 రంగాలకు రూ.1.97 లక్షల కోట్లతో పీఎల్‌ఐ పథకాలను ప్రభుత్వం ప్రకటించింది.

ఫార్మాస్యూటికల్‌, ఔషధాల రంగం గత ఏడాది డిసెంబరు నాటికి రూ.25,813 కోట్ల పెట్టుబడులను ఆకర్షించింది. డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌, సిప్లా, గ్లెన్‌మార్క్‌, బయోకాన్‌, వోఖార్డ్‌ వంటి సంస్థలు ఈ పథకం కింద లబ్ధి పొందాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని