సింగపూర్‌లో ఫోన్‌పే యూపీఐ సేవలు

యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌(యూపీఐ) ద్వారా సింగపూర్‌లో తమ ఖాతాదార్లు చెల్లింపులు చేయొచ్చని ఫిన్‌టెక్‌ సంస్థ ఫోన్‌పే బుధవారం వెల్లడించింది.

Published : 04 Apr 2024 01:47 IST

దిల్లీ: యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌(యూపీఐ) ద్వారా సింగపూర్‌లో తమ ఖాతాదార్లు చెల్లింపులు చేయొచ్చని ఫిన్‌టెక్‌ సంస్థ ఫోన్‌పే బుధవారం వెల్లడించింది. ఈ మేరకు సింగపూర్‌ టూరిజమ్‌ బోర్డు (ఎస్‌టీబీ)తో ఒప్పందంపై సంతకాలు చేసినట్లు తెలిపింది. భారత్‌, సింగపూర్‌ల మధ్య ఇప్పటికే ఉన్న యూపీఐ అనుసంధానతపై ఈ ఒప్పందం కుదిరిందని, ఖాతాదార్లు తమ ప్రస్తుత భారతీయ బ్యాంక్‌ ఖాతాల నుంచి నేరుగా రెండు దేశాల మధ్య విదేశీ లావాదేవీలను (క్రాస్‌-బోర్డర్‌ ట్రాన్సాక్షన్స్‌) తక్షణమే చేయడానికి అనుమతిస్తుందని పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని