పెద్ద ఆర్డర్ల డెలివరీకి జొమాటో ప్రత్యేక వాహనం

50 మంది వరకు స్నేహితులు/ కుటుంబ సభ్యులు/ సహోద్యోగులతో జరుపుకునే వేడుకలు, ఫంక్షన్లు, కార్యక్రమాల కోసం ఆహార పదార్థాలను డెలివరీ చేస్తామని జొమాటో తెలిపింది.

Published : 17 Apr 2024 01:40 IST

దిల్లీ: 50 మంది వరకు స్నేహితులు/ కుటుంబ సభ్యులు/ సహోద్యోగులతో జరుపుకునే వేడుకలు, ఫంక్షన్లు, కార్యక్రమాల కోసం ఆహార పదార్థాలను డెలివరీ చేస్తామని జొమాటో తెలిపింది. ఇందుకోసం ప్రత్యేక వాహనాలను సంస్థ ప్రారంభించింది. ఇవి అన్నీ విద్యుత్తు వాహనాలు అని కంపెనీ తెలిపింది. పెద్ద ఆర్డర్లకు సంబంధించి ఈ తరహా వాహనాలను ఉపయోగిస్తుండటం దేశంలో ఇదే మొదటిసారి అని జొమాటో సీఈఓ దీపిందర్‌ గోయల్‌ తెలిపారు. ఇంతకుముందు పెద్ద ఆర్డర్లు తీసుకున్నా, సంప్రదాయ డెలివరీ భాగస్వాములే అందించేవాళ్లు అని తెలిపారు. దీని వల్ల వినియోగదారుకు ఆశించిన స్థాయిలో అనుభూతి ఉండేది కాదని పేర్కొన్నారు. కొత్త వాహనాల వల్ల మరింత సౌకర్యంగా ఉంటుందని వెల్లడించారు. కూలింగ్‌ కంపార్ట్‌మెంట్‌లు, హాట్‌ బాక్స్‌ల వంటివి ఏర్పాటు చేయడం ద్వారా వినియోగదార్లు కోరుకున్న రీతిలో ఆహార పదార్థాలను డెలివరీ చేయాలన్నది తమ ఉద్దేశమని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని