ఏపీలో 79 లక్షల ఎయిర్‌టెల్‌ 5జీ వినియోగదారులు

ఆంధ్రప్రదేశ్‌ అంతటా 5జీ సేవలను విస్తరించామని టెలీకమ్యూనికేషన్స్‌ సేవల సంస్థ భారతీ ఎయిర్‌టెల్‌ వెల్లడించింది.

Updated : 21 Apr 2024 02:20 IST

ఈనాడు, హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ అంతటా 5జీ సేవలను విస్తరించామని టెలీకమ్యూనికేషన్స్‌ సేవల సంస్థ భారతీ ఎయిర్‌టెల్‌ వెల్లడించింది. రాష్ట్రంలో 79 లక్షల వినియోగదారులు ఈ సేవలను వినియోగించుకుంటున్నారని ఒక ప్రకటనలో వెల్లడించింది. గత ఆరు నెలల కాలంలో వీరి సంఖ్య గణనీయంగా పెరిగిందని తెలిపింది. వినియోగదారులు సులభంగా 5జీకి మారే ప్రక్రియను సులభతరం చేసినట్లు పేర్కొంది. ఈ సందర్భంగా ఎయిర్‌టెల్‌ ఆంధ్రప్రదేశ్‌ సీఈఓ శివన్‌ భార్గవ మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా 5జీ నెట్‌వర్క్‌ను విస్తృతం చేసేందుకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఎలాంటి అదనపు ఖర్చులూ లేకుండా అపరిమిత 5జీ సేవలను వినియోగించుకోవచ్చని తెలిపారు. పోకోతో కలిసి రూ.10,000 లోపు ధర 5జీ స్మార్ట్‌ఫోన్లను అందిస్తున్నట్లు ఎయిర్‌టెల్‌ వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని