మస్క్‌ భారత పర్యటన వాయిదా

విద్యుత్‌ కార్ల తయారీ సంస్థ టెస్లా అధిపతి ఎలాన్‌ మస్క్‌ భారత్‌ పర్యటన వాయిదా పడింది. కంపెనీలో అతి ముఖ్యమైన బాధ్యతల కారణంగా పర్యటన ఆలస్యమవుతోందని ‘ఎక్స్‌’ వేదికగా ఆయన వెల్లడించారు.

Published : 21 Apr 2024 02:29 IST

ఈ ఏడాది చివర్లో వస్తానన్న టెస్లా సీఈఓ

దిల్లీ: విద్యుత్‌ కార్ల తయారీ సంస్థ టెస్లా అధిపతి ఎలాన్‌ మస్క్‌ భారత్‌ పర్యటన వాయిదా పడింది. కంపెనీలో అతి ముఖ్యమైన బాధ్యతల కారణంగా పర్యటన ఆలస్యమవుతోందని ‘ఎక్స్‌’ వేదికగా ఆయన వెల్లడించారు. ఈ ఏడాది చివర్లో భారత్‌లో పర్యటించేందుకు ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 21, 22 తేదీల్లో ఆయన మన దేశంలో పర్యటించాల్సి ఉంది. ఈ రెండు రోజుల పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీతో కీలక సమావేశం ఉంటుందని, అనంతరం ఆయన భారత్‌లో టెస్లా పెట్టుబడులు, ప్లాంటు ఏర్పాటుపై కీలక ప్రకటన చేస్తారని అంతా భావించారు. టెస్లా ఆర్థిక ఫలితాలు ఏప్రిల్‌ 23న ప్రకటించాల్సి ఉండడమే ఈ వాయిదాకు కారణమని తెలుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని