యాపిల్‌ 5 లక్షల ఉద్యోగాలు!

వచ్చే మూడేళ్లలో భారత్‌లో వెండర్‌ల ద్వారా 5 లక్షలకు పైగా ఉద్యోగాలను ఐఫోన్‌ తయారీ సంస్థ యాపిల్‌ సృష్టించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

Published : 22 Apr 2024 02:06 IST

దిల్లీ: వచ్చే మూడేళ్లలో భారత్‌లో వెండర్‌ల ద్వారా 5 లక్షలకు పైగా ఉద్యోగాలను ఐఫోన్‌ తయారీ సంస్థ యాపిల్‌ సృష్టించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం యాపిల్‌ వెండర్‌లు, సరఫరాదార్లు భారత్‌లో 1.5 లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నారు. యాపిల్‌ కోసం రెండు ప్లాంట్‌లను నిర్వహిస్తున్న టాటా ఎలక్ట్రానిక్స్‌, అత్యధికంగా ఉద్యోగాలు ఇస్తోంది. ప్రభుత్వ వర్గాల అంచనాలపై స్పందించేందుకు యాపిల్‌ నిరాకరించింది. వచ్చే 4-5 ఏళ్లలో భారత్‌లో ఉత్పత్తిని అయిదు రెట్లు పెంచి 40 బిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.3.32 లక్షల కోట్లు) చేయాలని యాపిల్‌ ప్రణాళికలు వేస్తోంది. కౌంటర్‌పాయింట్‌ రీసెర్చ్‌ ప్రకారం.. 2023లో అత్యధిక ఆదాయంతో, భారత విపణిలో యాపిల్‌ ఆధిపత్యం చెలాయించింది. ఫోన్ల సంఖ్యా పరంగా శామ్‌సంగ్‌ అగ్రస్థానంలో నిలిచింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని