పేటీఎం దేశీయ 4జీ సౌండ్‌బాక్స్‌ల ఆవిష్కరణ

దేశీయ ఫిన్‌టెక్‌ దిగ్గజం పేటీఎం, చెల్లింపుల కోసం వినియోగించే యూపీఐ (యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌), క్రెడిట్‌ కార్డ్‌ల కోసం దేశీయంగా తయారైన రెండు సౌండ్‌బాక్స్‌లను సోమవారం ఆవిష్కరించింది.

Published : 23 Apr 2024 01:45 IST

దిల్లీ: దేశీయ ఫిన్‌టెక్‌ దిగ్గజం పేటీఎం, చెల్లింపుల కోసం వినియోగించే యూపీఐ (యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌), క్రెడిట్‌ కార్డ్‌ల కోసం దేశీయంగా తయారైన రెండు సౌండ్‌బాక్స్‌లను సోమవారం ఆవిష్కరించింది. వినియోగదారులు క్యూఆర్‌ కోడ్‌ ద్వారా, చెల్లింపు జరిపే సమయంలో వచ్చే నోటిఫికేషన్‌ మరింత నాణ్యంగా ఉండేలా ఈ పరికరాలను పరిచయం చేసింది. ఈ అడ్వాన్స్‌డ్‌ సౌండ్‌ బాక్స్‌ల్లో ఉత్తమ శబ్ద నాణ్యతతో పాటు 10 రోజుల పాటు బ్యాటరీ లైఫ్‌ ఉంటుందని, మన దేశ పరిస్థితులకు సరిపోయేలా వీటిని రూపొందించినట్లు పేటీఎం వ్యవస్థాపకులు, సీఈఓ విజయ్‌ శేఖర్‌ శర్మ వెల్లడించారు. పరిసరాల్లో రణగొణ ధ్వనులు ఉన్నా, వివరాలు స్పష్టతతో వినిపించేలా పేటీఎం సౌండ్‌ బాక్స్‌, పాకెట్‌ సౌండ్‌ బాక్స్‌లను విడుదల చేసినట్లు శర్మ తెలిపారు. ఇవి 4జీ అనుసంధానత కలిగిన వాటర్‌ప్రూఫ్‌ సౌండ్‌ బాక్స్‌లు. 11 భాషల్లో వివరాలు వెల్లడించడం ఈ సౌండ్‌ బాక్స్‌ల ప్రత్యేకతగా కంపెనీ తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని