వచ్చే 6 నెలల్లో మ్యాజిక్‌పిన్‌లో 250 నియామకాలు

ఫ్యాషన్‌, ఆహార పదార్థాలు, ఎలక్ట్రానిక్స్‌, నిత్యావసరాలు.. ఇలా వివిధ విభాగాల్లో బ్రాండ్లు, వ్యాపార సంస్థల అన్వేషణకు ఉపయోగపడే ఇ-కామర్స్‌ సంస్థ మ్యాజిక్‌పిన్‌ వచ్చే ఆరు నెలల్లో 250 మందిని నియమించుకునే యోచనలో ఉంది.

Published : 24 Apr 2024 02:37 IST

దిల్లీ: ఫ్యాషన్‌, ఆహార పదార్థాలు, ఎలక్ట్రానిక్స్‌, నిత్యావసరాలు.. ఇలా వివిధ విభాగాల్లో బ్రాండ్లు, వ్యాపార సంస్థల అన్వేషణకు ఉపయోగపడే ఇ-కామర్స్‌ సంస్థ మ్యాజిక్‌పిన్‌ వచ్చే ఆరు నెలల్లో 250 మందిని నియమించుకునే యోచనలో ఉంది. వీరిలో 150 మందిని తన విక్రయాలు- కొనుగోలు బృందం కోసం, 100 మందిని ‘ఓఎన్‌డీసీ-మ్యాజిక్‌పిన్‌ స్ట్రీట్‌ బైట్స్‌’ ప్రాజెక్టు కోసం నియమించుకోనుంది. ‘ఓఎన్‌డీసీ-మ్యాజిక్‌పిన్‌ స్ట్రీట్‌ బైట్స్‌’ ప్రాజెక్టుకు ఓఎన్‌డీసీ సహకారం అందిస్తోంది. వీధుల్లో ఆహారపదార్థాలు విక్రయించే వర్తకుల ఆర్థిక సాధికారికత కోసం ఈ ప్రాజెక్టు బృందం కృషి చేయనుంది. ‘వ్యూహాత్మక విస్తరణలో భాగంగా మా విక్రయాలు-కొనుగోళ్ల బృందం కోసం 150 మందికి పైగా వృత్తినిపుణులను నియమించుకోనున్నాం. తాజా నియామకాలతో సంస్థ మొత్తం సిబ్బంది సంఖ్య 550ను మించుతుంది. అయితే ఓఎన్‌డీసీ ప్రాజెక్టు కోసం నియమించుకోనున్న 100 మందిని ఈ సంఖ్యలో కలుపలేదు. కొత్తగా చేపట్టబోయే నియామకాలు ఫ్యాషన్‌, ఫైన్‌ డైనింగ్‌, సౌందర్యం, క్యూఎస్‌ఆర్‌, బడ్జెట్‌ ఈటరీస్‌ లాంటి విబాగాల్లో ఆదాయ వృద్ధికి దోహదం చేస్తాయని కంపెనీ తెలిపింది. వ్యాపార సంస్థలతో భాగస్వామ్యాల బలోపేతం ద్వారా వివిధ ప్రాంతాల్లో తన ఉనికిని మరింతగా విస్తరించుకునేందుకు తోడ్పడుతుందని పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు