బ్యాటరీ ప్లాంట్ల ఏర్పాటుకు ‘అమరరాజా’ సహా 7 కంపెనీల బిడ్‌

ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (పీఎల్‌ఐ) పథకం కింద బ్యాటరీ ప్లాంట్లు స్థాపించేందుకు అమరరాజా అడ్వాన్స్‌డ్‌ సెల్‌ టెక్నాలజీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ సహా 7 కంపెనీల నుంచి బిడ్‌లు అందినట్లు ప్రభుత్వం వెల్లడించింది.

Published : 24 Apr 2024 02:42 IST

దిల్లీ: ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (పీఎల్‌ఐ) పథకం కింద బ్యాటరీ ప్లాంట్లు స్థాపించేందుకు అమరరాజా అడ్వాన్స్‌డ్‌ సెల్‌ టెక్నాలజీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ సహా 7 కంపెనీల నుంచి బిడ్‌లు అందినట్లు ప్రభుత్వం వెల్లడించింది. మిగతా 4 కంపెనీల్లో ఏసీఎంఈ క్లీన్‌టెక్‌ సొల్యూషన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, అన్వి పవర్‌ ఇండస్ట్రీస్‌, లుకాస్‌ టీవీఎస్‌, వారీ ఎనర్జీస్‌ సంస్థలు ఉన్నాయి. 10 గిగావాట్‌ అవర్‌ (జీడబ్ల్యూహెచ్‌) సామర్థ్యంతో బ్యాటరీ ప్లాంట్లు ఏర్పాటు చేసే సంస్థలకు పీఎల్‌ఐ పథకం కింద రూ.3,620 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఈ ఏడాది జనవరి 24న 10 జీడబ్ల్యూహెచ్‌ సామర్థ్యానికి టెండర్‌ పిలవగా, మొత్తంగా 70         జీడబ్ల్యూహెచ్‌ సామర్థ్యంతో బ్యాటరీ తయారీ యూనిట్ల ఏర్పాటుకు సుముఖత చూపుతూ బిడ్‌లు వచ్చాయి. అంటే 7 రెట్ల అధిక స్పందన లభించింది. 10 గిగావాట్‌ అవర్‌ అడ్వాన్స్‌డ్‌ కెమిస్ట్రీ సెల్‌ (ఏసీసీ) తయారీకి ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల కోసం రీబిడ్డింగ్‌ ప్రక్రియను మంత్రిత్వశాఖ చేపట్టింది. దీనికి సంబంధించి ప్రి-బిడ్‌ సమావేశం ఫిబ్రవరి 12న జరిగింది. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ ఏప్రిల్‌ 22కాగా.. సాంకేతిక బిడ్‌లు మంగళవారం తెరిచారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు