భారత్‌ వృద్ధి 6.6%

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25) లో భారత ఆర్థిక వ్యవస్థ 6.6% వృద్ధి రేటును నమోదు చేయొచ్చని మూడీస్‌ రేటింగ్స్‌ అంచనా వేసింది.

Published : 20 May 2024 01:24 IST

2024-25పై మూడీస్‌ అంచనా

దిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25) లో భారత ఆర్థిక వ్యవస్థ 6.6% వృద్ధి రేటును నమోదు చేయొచ్చని మూడీస్‌ రేటింగ్స్‌ అంచనా వేసింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో 6.2% వృద్ధి నమోదు కావొచ్చని పేర్కొంది. ఆర్థిక వ్యవస్థ రాణింపుతో, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్‌బీఎఫ్‌సీ)ల రుణ మంజూరులో బలమైన వృద్ధి లభిస్తుందని, తద్వారా వీటి లాభదాయకతపై నిధుల సమీకరణ వ్యయాల ప్రభావం తగ్గుతుందని తెలిపింది. వడ్డీ రేట్ల పెంపుతో తమ వినియోగదార్లపై రుణ భారం పెరిగినా, ఆస్తుల నాణ్యతను పరిరక్షించేందుకు కూడా ఆర్థిక వ్యవస్థలోని సానుకూల పరిస్థితులు ఉపకరిస్తాయని వివరించింది. వచ్చే 12-18 నెలల్లో ఎన్‌బీఎఫ్‌సీల రుణాల మంజూరు 15% పెరగొచ్చని మూడీస్‌ అంచనా వేస్తోంది. వ్యక్తులు, వ్యాపార సంస్థల రుణ అవసరాలు తీర్చడంలో ఎన్‌బీఎఫ్‌సీలు ముఖ్య పాత్ర పోషించడం కొనసాగుతుందని తెలిపింది. అయితే ఆర్‌బీఐ ఆదేశాల నేపథ్యంలో హామీరహిత రుణాల్లో వృద్ధి నెమ్మదించే అవకాశం ఉందని పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని