పసుపు కిందకు!

పసిడి జూన్‌ కాంట్రాక్టు ఈవారం సానుకూల ధోరణిలో చలిస్తే రూ.74,412 వద్ద నిరోధం ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది.

Published : 20 May 2024 01:31 IST

కమొడిటీస్‌ ఈ వారం
పసిడి

పసిడి జూన్‌ కాంట్రాక్టు ఈవారం సానుకూల ధోరణిలో చలిస్తే రూ.74,412 వద్ద నిరోధం ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈ స్థాయిని అధిగమిస్తే రూ.75,113 వరకు పెరగొచ్చు. ఒకవేళ రూ.72,380 కంటే దిగువన ట్రేడయితే రూ.71,049; రూ.70,348 వరకు దిగివచ్చే అవకాశం ఉంటుంది.


వెండి

వెండి జూన్‌ కాంట్రాక్టు రూ.94,247 కంటే పైన చలిస్తే రూ.97,471 వరకు వెళ్లే అవకాశం ఉంటుంది. అదేవిధంగా రూ.86,088 కంటే దిగువన ట్రేడయితే రూ.81,153 వరకు దిద్దుబాటు అవుతుందని భావించొచ్చు. రూ.87,700 కంటే దిగువన ట్రేడ్‌ కాకుంటే షార్ట్‌ సెల్‌పొజిషన్ల జోలికి వెళ్లకపోవడం మంచిదే.


ప్రాథమిక లోహాలు

  • రాగి మే కాంట్రాక్టు ప్రతికూల ధోరణిలో చలిస్తే రూ.833.75 వద్ద మద్దతు లభించొచ్చు. ఈ స్థాయిని కోల్పోతే మరింతగా దిద్దుబాటు కావొచ్చు. ఒకవేళ సానుకూల ధోరణిలో కదలాడితే రూ.934.45 వద్ద నిరోధం ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఈ స్థాయిని అధిగమిస్తే రూ.952.15 వరకు వెళ్లొచ్చు. 
  • సీసం మే కాంట్రాక్టు రూ.195.60 కంటే ఎగువన చలించకుంటే షార్ట్‌ సెల్‌ పొజిషన్ల వైపు మొగ్గు చూపడం మంచిది. 
  • జింక్‌ మే కాంట్రాక్టు రూ.263.40 దిగువన కదలాడితే దిద్దుబాటుకు ఆస్కారం ఉంటుంది. ఒకవేళ ఈ స్థాయికి పైన చలిస్తే మరింతగా రాణిస్తుందని భావించొచ్చు. 
  • అల్యూమినియం మే కాంట్రాక్టు కిందకు వస్తే రూ.233.45 వద్ద మద్దతు లభించొచ్చు. ఈ స్థాయిని కోల్పోతే రూ.227.05కు దిగిరావచ్చు. ఒకవేళ సానుకూల ధోరణిలో కదలాడితే రూ.243.45 వద్ద నిరోధం ఎదురు కావొచ్చు. దీనిని అధిగమిస్తే రూ.247.15 వరకు పెరిగే అవకాశం ఉంటుంది.

ఇంధన రంగం

  • ముడి చమురు జూన్‌ కాంట్రాక్టు రూ.6,427 కంటే దిగువన చలిస్తే రూ.6,303; రూ.6,172 వరకు దిద్దుబాటు కావొచ్చు. ఒకవేళ రూ.6,538 కంటే దిగువన ట్రేడ్‌ కాకుంటే   రూ.6,740 వరకు పెరిగే అవకాశం ఉంటుంది. 
  • సహజవాయువు మే కాంట్రాక్టుకు రూ.196.05 వద్ద మద్దతు కనిపిస్తోంది. ఈ స్థాయిని కోల్పోతే రూ.175.25కు పడిపోవచ్చు. అదేవిధంగా పైకి వెళ్తే రూ.227.75 వద్ద నిరోధం ఎదురుకావొచ్చు. దీనిని అధిగమిస్తే రూ.238.75 వరకు రాణించొచ్చు.

వ్యవసాయ ఉత్పత్తులు

  • పసుపు జూన్‌ కాంట్రాక్టు ప్రతికూల ధోరణిలో కదలాడేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల పెరిగినప్పుడల్లా షార్ట్‌ సెల్‌ చేయడం మంచి వ్యూహం అవుతుంది. 
  • పత్తి క్యాండీ మే కాంట్రాక్టు రూ.55,513 కంటే దిగువన చలిస్తే రూ.54,926కు దిగి రావొచ్చు. అదేవిధంగా రూ.56,993 కంటే పైన కదలాడితే రూ.57,886 వరకు పెరిగే అవకాశం ఉంటుంది.

ఆర్‌ఎల్‌పీ కమొడిటీ అండ్‌ డెరివేటివ్స్‌


నేడు మార్కెట్లకు సెలవు

ముంబయిలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ కారణంగా సోమవారం బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలకు సెలవు ప్రకటించారు. బులియన్, ఫారెక్స్‌ మార్కెట్లు కూడా పని చేయవు. కమొడిటీ మార్కెట్లు సాయంత్రం 5 గంటల నుంచి పనిచేస్తాయి.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని