ఎస్‌బీఐ ఛైర్మన్‌ పదవికి నేడు ఇంటర్వ్యూలు

ప్రభుత్వ రంగ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) ఛైర్మన్‌ పదవికి అర్హులైన అభ్యర్థుల ఇంటర్వ్యూలను ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ బ్యూరో (ఎఫ్‌ఎస్‌ఐబీ) మంగళవారం నిర్వహించనుందని సంబంధిత వర్గాలు తెలిపాయి.

Published : 21 May 2024 01:54 IST

దిల్లీ: ప్రభుత్వ రంగ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) ఛైర్మన్‌ పదవికి అర్హులైన అభ్యర్థుల ఇంటర్వ్యూలను ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ బ్యూరో (ఎఫ్‌ఎస్‌ఐబీ) మంగళవారం నిర్వహించనుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఎస్‌బీఐ ప్రస్తుత ఛైర్మన్‌ దినేశ్‌ కుమార్‌ ఖారా ఈ ఏడాది ఆగస్టు 28న పదవీ విరమణ చేయనున్నారు. ఎస్‌బీఐ ఛైర్మన్‌ పదవికి గరిష్ఠ వయోపరిమితి 63 ఏళ్లు కాగా.. దినేశ్‌ ఖారాకు ఆ రోజు పూర్తికానుంది. దీంతో ఎస్‌బీఐ ప్రస్తుత మేనేజింగ్‌ డైరెక్టర్‌ల నుంచి ఒకరిని ఛైర్మన్‌గా నియమించనున్నారు. ఇందుకు ఎఫ్‌ఎస్‌ఐబీ ఇంటర్వ్యూలు చేసి, తుది పేర్లను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని మంత్రివర్గ నియామకాల కమిటీకి పంపనుంది. ఎఫ్‌ఎస్‌ఐబీకి డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ పర్సనల్‌ అండ్‌ ట్రైనింగ్‌ (డీఓపీటీ) మాజీ కార్యదర్శి భాను ప్రతాప్‌ శర్మ నేతృత్వం వహిస్తున్నారు. ఇందులో సభ్యులుగా ప్రభుత్వం నియమించిన సెలెక్షన్‌ ప్యానెల్, ఆర్థిక సేవల కార్యదర్శి, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ ఎంటర్‌ప్రైజెస్‌ కార్యదర్శి, ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌ ఉంటారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని