2023-24 వృద్ధి 7.8 శాతం!

గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో భారత జీడీపీ వృద్ధి రేటు 6.7 శాతంగా నమోదు కావొచ్చని దేశీయ రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా అంచనా వేస్తోంది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి (2023-24) వృద్ధిరేటు 7.8 శాతానికి చేరొచ్చని పేర్కొంది.

Published : 22 May 2024 01:51 IST

నాలుగో త్రైమాసికంలో 6.7%: ఇక్రా  

దిల్లీ: గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో భారత జీడీపీ వృద్ధి రేటు 6.7 శాతంగా నమోదు కావొచ్చని దేశీయ రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా అంచనా వేస్తోంది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి (2023-24) వృద్ధిరేటు 7.8 శాతానికి చేరొచ్చని పేర్కొంది. భారత ఆర్థిక వ్యవస్థ గత ఆర్థిక సంవత్సరం తొలి మూడు త్రైమాసికాల్లో 8.2%, 8.1%, 8.4% చొప్పున వృద్ధి చెందిన విషయం విదితమే. వరుస మూడు త్రైమాసికాల పాటు 8 శాతం ఎగువన వృద్ధి నమోదైనా, నాలుగో త్రైమాసికంలో మాత్రం తగ్గనుందన్నమాట. విక్రయాల వృద్ధి తగ్గడం, కమొడిటీ ధరలూ కిందకు దిగిరావడంతో లాభాలు పరిమితం కావడం, కొన్ని పరిశ్రమ రంగాల్లో లాభదాయకత పుంజుకోకపోవడంతో భారత జీవీఏ వృద్ధి నాలుగో త్రైమాసికంలో దిగాలు పడవచ్చని ఇక్రా ప్రధాన ఆర్థికవేత్త అదితి నాయర్‌ అంటున్నారు. 2022-23 వృద్ధి 7 శాతంతో పోలిస్తే 2023-24 ఏడాదికి ఇక్రా అంచనా అయిన 7.8 శాతం అధికమే. 2023-24 నాలుగో త్రైమాసిక జీడీపీ గణాంకాలు, పూర్తి ఏడాదికి తాత్కాలిక అంచనాలు ఈనెల 31న వెలువడనున్నాయి.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని