భారత డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థ జిగేల్‌

భారత డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థ ఏటా 2.8 శాతం వృద్ధితో 2027-28 కల్లా లక్ష కోట్ల డాలర్ల (దాదాపు రూ.83 లక్షల కోట్ల) స్థాయికి చేరగలదని ఎలక్ట్రానిక్స్, ఐటీ సహాయ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ పేర్కొన్నారు.

Published : 22 May 2024 01:59 IST

2027-28 కల్లా లక్ష కోట్ల డాలర్లకు
రాజీవ్‌ చంద్రశేఖర్‌ అంచనా

దిల్లీ: భారత డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థ ఏటా 2.8 శాతం వృద్ధితో 2027-28 కల్లా లక్ష కోట్ల డాలర్ల (దాదాపు రూ.83 లక్షల కోట్ల) స్థాయికి చేరగలదని ఎలక్ట్రానిక్స్, ఐటీ సహాయ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ పేర్కొన్నారు. ఇండియాఏఐ మిషన్‌కు కేటాయింపులనూ ప్రస్తుత రూ.10,000 కోట్ల నుంచి రూ.20,000 కోట్లకు పెంచుతామని ఆయన తెలిపారు. 2026-27 కల్లా 1 లక్ష కోట్ల డాలర్ల స్థాయికి భారత డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థ చేరగలదని ప్రభుత్వం గతంలో అంచనా వేసింది. అయితే కరోనా పరిణామాల వంటి కారణాలతో లక్ష్యాన్ని ఒక ఏడాది అదనంగా పొడిగించినట్లు 300కు పైగా ఐటీ, అంకుర, టెక్‌ పరిశ్రమ దిగ్గజాలతో జరిగిన కార్యక్రమంలో భాగంగా చంద్రశేఖర్‌ పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ దార్శనికత కారణంగానే ఈ లక్ష్యాన్ని నిర్ణయించుకోగలిగామని ఆయన అన్నారు. ఇప్పటికే ప్రధాని ఆమోదం తెలిపిన రూ.లక్ష కోట్ల సీడ్‌ ఫండ్‌ ద్వారా పరిశోధన- అభివృద్ధి (ఆర్‌ అండ్‌ డీ)లో పెట్టుబడులు పెడతామని మంత్రి తెలిపారు. టెక్‌ పరిశ్రమ అభివృద్ధి ధోరణిని కొనసాగించాలని కోరుకుంటున్నామన్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని