ముడి సరకులకు అధిక పన్ను.. సమస్య పరిష్కారంపై ప్రభుత్వ దృషి

కాగితం, ఫర్నిచర్, సోలార్‌ గ్లాస్, వాషింగ్‌ మెషీన్, వాయు శుద్ధి యంత్రాల లాంటి కొన్ని ఉత్పత్తుల విషయంలో ఎదురవుతున్న ఇన్వర్టెడ్‌ సుంకం (అంత్య ఉత్పత్తిపై కంటే ముడి సరకుపై ఎక్కువ పన్ను రేట్లు ఉండటం) సమస్యను పరిష్కరించడంపై ప్రభుత్వం దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తోంది.

Published : 23 May 2024 01:56 IST

దిల్లీ: కాగితం, ఫర్నిచర్, సోలార్‌ గ్లాస్, వాషింగ్‌ మెషీన్, వాయు శుద్ధి యంత్రాల లాంటి కొన్ని ఉత్పత్తుల విషయంలో ఎదురవుతున్న ఇన్వర్టెడ్‌ సుంకం (అంత్య ఉత్పత్తిపై కంటే ముడి సరకుపై ఎక్కువ పన్ను రేట్లు ఉండటం) సమస్యను పరిష్కరించడంపై ప్రభుత్వం దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తోంది. దేశీయంగా వీటి తయారీని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉంది. ఇన్వర్టెడ్‌ సుంకం సమస్య ఉన్న ఉత్పత్తుల జాబితాను ఇప్పటికే ఆర్థిక శాఖకు వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ సమర్పించింది. పరిశ్రమ సంఘాలు, ఎగుమతి ప్రోత్సాహక మండలితో విస్తృత సంప్రదింపుల అనంతరం ఈ జాబితాను సిద్ధం చేసినట్లు ఒక అధికారి తెలిపారు. ఇన్వర్టెడ్‌ సుంకం విధానంలో అంత్య ఉత్పత్తిపై (ఫినిష్డ్‌ ప్రోడక్ట్‌) విధించే పన్ను కంటే.. వాటి తయారీలో ఉపయోగించే ముడి సరకుపైనే ఎక్కువ పన్ను రేట్లు ఉంటాయి. దీని వల్ల తయారీదార్లకు రుణ వ్యయాలు, పన్నుల భారం ఎక్కువ అవుతుండటంతో దేశీయ పరిశ్రమపై ప్రతికూల ప్రభావం పడుతోంది. ముడి సరకులపై అధిక పన్నుల కారణంగా ఉత్పత్తుల తయారీ ఖర్చు కూడా పెరుగుతుంది. దీంతో ఆ మేరకు ఎక్కువ ధరకు వాటిని విక్రయించాల్సి ఉంటుండటంతో, అంతర్జాతీయ విపణుల్లో మన ఉత్పత్తుల పోటీ సామర్థ్యం తగ్గుతోంది. ఇన్వర్టెడ్‌ సుంకం సమస్య పరిష్కారంతో దేశీయ ఉత్పత్తుల పోటీ సామర్థ్యం పెరగడమే కాకుండా, ఎగుమతులు పెరిగేందుకు దోహదం చేస్తుంది. తద్వారా తయారీకి ప్రోత్సాహం లభిస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని