తాజ్‌జీవీకే లాభం రూ.26 కోట్లు

తాజ్‌జీవీకే హోటల్స్‌ అండ్‌ రిసార్ట్స్‌ లిమిటెడ్‌ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికానికి రూ.116 కోట్ల ఆదాయాన్ని, రూ.26 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది.

Published : 24 May 2024 03:02 IST

ఈనాడు, హైదరాబాద్‌: తాజ్‌జీవీకే హోటల్స్‌ అండ్‌ రిసార్ట్స్‌ లిమిటెడ్‌ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికానికి రూ.116 కోట్ల ఆదాయాన్ని, రూ.26 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. 2022-23 ఇదేకాలంలో ఆదాయం రూ.106 కోట్లు, నికరలాభం రూ.14 కోట్లే ఉన్నాయి. దీంతో పోల్చితే ఈసారి నికరలాభం దాదాపు రెట్టింపైంది. గత ఆర్థిక సంవత్సరం (2023-24) పూర్తి కాలానికి  ఈ సంస్థ రూ.410 కోట్ల ఆదాయాన్ని, రూ.74 కోట్ల నికరలాభాన్ని నమోదు చేసింది. 2022-23లో ఆదాయం రూ.412 కోట్లు, నికరలాభం రూ.79 కోట్లు ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరం ఆదాయాలు స్థిరంగా ఉండగా, 4వ త్రైమాసికంలో కొంత మెరుగైన ఫలితాలు సాధించినట్లు తాజ్‌జీవీకే హోటల్స్‌ ఛైర్మన్‌ జీవీకే రెడ్డి వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు