ఫ్లిప్‌కార్ట్‌లో వాటా కొనుగోలుకు గూగుల్‌ రూ.2,900 కోట్ల పెట్టుబడి!

వాల్‌మార్ట్‌ గ్రూపునకు చెందిన ఇ-కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో స్వల్ప వాటా కొనుగోలు చేసేందుకు గూగుల్‌ 350 మిలియన్‌ డాలర్లు (సుమారు రూ.2,900 కోట్లు) పెట్టుబడి పెట్టేందుకు ప్రతిపాదించింది.

Published : 25 May 2024 02:12 IST

దిల్లీ: వాల్‌మార్ట్‌ గ్రూపునకు చెందిన ఇ-కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో స్వల్ప వాటా కొనుగోలు చేసేందుకు గూగుల్‌ 350 మిలియన్‌ డాలర్లు (సుమారు రూ.2,900 కోట్లు) పెట్టుబడి పెట్టేందుకు ప్రతిపాదించింది. ఫ్లిప్‌కార్ట్‌ ప్రస్తుతం 1 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.8300 కోట్ల) నిధులను సమీకరించే ప్రక్రియలో ఉంది. ఇందులో 600 మిలియన్‌ డాలర్ల (సుమారు రూ.5,000 కోట్ల)ను మాతృసంస్థ వాల్‌మార్ట్‌ నుంచి పొందిందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. సంస్థ విలువను 35 బిలియన్‌ డాలర్లు (సుమారు రూ.2.90 లక్షల కోట్లు)గా పరిగణించి, ఈ నిధుల సమీకరణను ఫ్లిప్‌కార్ట్‌ చేపడుతోంది. దీనికి నియంత్రణ పరమైన, ఇతర అవసరమైన అనుమతులు లభించాల్సి ఉంటుంద’ని ఫ్లిప్‌కార్ట్‌ తెలిపింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని