2024-25కు సీఐఐ 363 పాయింట్లు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2024-25) వ్యయ ద్రవ్యోల్బణం  సూచీని (సీఐఐ)ని ఆదాయపు పన్ను విభాగం నోటిఫై చేసింది.

Published : 26 May 2024 02:49 IST

నోటిఫై చేసిన ఐటీ విభాగం

దిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2024-25) వ్యయ ద్రవ్యోల్బణం  సూచీని (సీఐఐ)ని ఆదాయపు పన్ను విభాగం నోటిఫై చేసింది. ద్రవ్యోల్బణాన్ని సర్దుబాటు చేసిన తర్వాత స్థిరాస్తులు, ఆభరణాలు, సెక్యూరిటీల విక్రయం ద్వారా ఆర్జించిన దీర్ఘకాల లాభాలను లెక్కించేందుకు సీఐఐని పన్ను చెల్లింపుదార్లు ఉపయోగిస్తారు. కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు నోటిఫికేషన్‌ ప్రకారం.. 2024-25 ఆర్థిక సంవత్సరానికి (2025-26 మదింపు సంవత్సరం) సీఐఐ 363 పాయింట్లుగా ఉంది. 2023-24లో ఇది 348 పాయింట్లు కాగా.. 2022-23లో 331 పాయింట్ల వద్ద ఉంది. 2023-24తో పోలిస్తే   2024-25కు సీఐఐ 15 పాయింట్లు పెరగడం గమనార్హం. సుమారుగా 4.3 శాతం వార్షిక ద్రవ్యోల్బణ రేటు ప్రకారం దీనిని నిర్ణయించినట్లు కనిపిస్తోంది. సాధారణంగా పన్ను చెల్లింపుదార్లు అధిక సీఐఐకు ప్రాధాన్యం ఇస్తుంటారు. దీని వల్ల వాళ్లు అధిక పన్ను రిబేట్‌లు పొందే అవకాశం ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని