అరబిందో ఫార్మా ఆకర్షణీయ లాభాలు

అరబిందో ఫార్మా కన్సాలిడేటెడ్‌ ఖాతాల ప్రకారం గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికానికి రూ.909 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. త్రైమాసిక ఆదాయం రూ.7,580 కోట్లు ఉంది.

Published : 26 May 2024 02:52 IST

యూఎస్, ఐరోపా మార్కెట్లో పెరిగిన అమ్మకాలు

ఈనాడు, హైదరాబాద్‌: అరబిందో ఫార్మా కన్సాలిడేటెడ్‌ ఖాతాల ప్రకారం గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికానికి రూ.909 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. త్రైమాసిక ఆదాయం రూ.7,580 కోట్లు ఉంది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఆదాయం రూ.6,473 కోట్లు, నికరలాభం రూ.506 కోట్లు ఉన్నాయి. దీంతో పోల్చితే ఆదాయం 17.1%, నికరలాభం 79.6% పెరగటం విశేషం. గత ఆర్థిక సంవత్సరం(2023-24) పూర్తికాలానికి రూ.29,002 కోట్ల ఆదాయాన్ని, రూ.3,173 కోట్ల నికరలాభాన్ని కంపెనీ నమోదు చేసింది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంలో ఆదాయం రూ.24,855 కోట్లు, నికరలాభం రూ.1,927 కోట్లు ఉన్నాయి. దీంతో పోల్చి చూస్తే, గత ఆర్థిక సంవత్సరంలో ఆదాయం 16.7%, నికరలాభం 64.6 శాతం పెరిగినట్లు అవుతోంది. యూఎస్‌ ఫార్ములేషన్ల ఆదాయం గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో ఆకర్షణీయంగా 21.6% పెరిగినట్లు కంపెనీ వెల్లడించింది. అదే విధంగా ఐరోపా దేశాల్లో ఆదాయం 10.4% పెరిగింది. పరిశోధన-అభివృద్ధి కార్యకలాపాలకు  రూ.392 కోట్లు (ఆదాయాల్లో   5.2%) వెచ్చించారు. అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ (యూఎస్‌ఎఫ్‌డీఏ) నుంచి 4 స్పెషాలిటీ/ ఇంజెక్టబుల్‌ ఔషధాలతో సహా 17 ఏఎన్‌డీఏ (అబ్రీవియేటెడ్‌ న్యూడ్రగ్‌ అప్లికేషన్‌) దరఖాస్తులకు అనుమతి లభించినట్లు కంపెనీ పేర్కొంది. మార్చి త్రైమాసికంలో ఎంతో మెరుగైన ఫలితాలు సాధించినట్లు అరబిందో ఫార్మా ఎండీ కె.నిత్యానంద రెడ్డి వివరించారు. కొత్త మార్కెట్లకు వెళ్లటం, కొత్త ఔషధాలు విడుదల చేయటం, మందుల ధరలు స్ధిరంగా ఉండటం కలిసొచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. దీనికి తోడు తమ ఉత్పత్తి సామర్థ్యం, ఉత్పాదకత పెరిగినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ ఆకర్షణీయమైన పనితీరు నమోదు చేయగలమనే ఆశాభావంతో ఉన్నట్లు వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు