రాగిలో అమ్మకాలు!

పసిడి జూన్‌ కాంట్రాక్టు ఈవారం సానుకూల ధోరణిలో చలిస్తే రూ.73,395 వద్ద నిరోధం ఎదురుకావచ్చు. ఈ స్థాయిని అధిగమిస్తే రూ.75,534; రూ.76,626 వరకు రాణించే అవకాశం ఉంది.

Published : 27 May 2024 03:03 IST

కమొడిటీస్‌ఈ వారం

పసిడి

పసిడి జూన్‌ కాంట్రాక్టు ఈవారం సానుకూల ధోరణిలో చలిస్తే రూ.73,395 వద్ద నిరోధం ఎదురుకావచ్చు. ఈ స్థాయిని అధిగమిస్తే రూ.75,534; రూ.76,626 వరకు రాణించే అవకాశం ఉంది. ఒకవేళ రూ.70,164 కంటే దిగువన ట్రేడయితే రూ.69,072 వరకు దిగిరావచ్చు. రూ.71,000 దిగువన లాంగ్‌ పొజిషన్లకు దూరంగా ఉండటమే మేలు. 


 వెండి 

వెండి జులై కాంట్రాక్టుకు రూ.94,248 వద్ద నిరోధం కనిపిస్తోంది. ఈ స్థాయిని మించితే రూ.97,949 వరకు వెళ్తుందని భావించొచ్చు. ఒకవేళ కిందకు వస్తే    రూ.88,548 వద్ద మద్దతు లభించవచ్చు. ఈ స్థాయినీ కోల్పోతే రూ.86,549 వరకు దిద్దుబాటు కావచ్చు.


ప్రాథమిక లోహాలు

  • రాగి జూన్‌ కాంట్రాక్టు రూ.933.90 కంటే ఎగువన ట్రేడ్‌ కాకుంటే మరింతగా పడిపోయే అవకాశం ఉంది. అందువల్ల షార్ట్‌ సెల్‌ పొజిషన్లను అట్టేపెట్టుకోవడం మంచిదే. 
  • సీసం జూన్‌ కాంట్రాక్టు రూ.191 కంటే కిందకు వస్తే రూ.186.95 వరకు దిగిరావచ్చు. ఒకవేళ రూ.191 కంటే పైన కదలాడితే    రూ.195 వరకు రాణించొచ్చు.
  • జింక్‌ జూన్‌ కాంట్రాక్టు రూ.265 కంటే దిగువన ట్రేడయితే, దిద్దుబాటుకు అవకాశం ఉంటుంది. లేకుంటే సానుకూల ధోరణి కొనసాగొచ్చు. ఇప్పటికే కాంట్రాక్టు మోతాదుకి మించి పెరిగినట్లు కనిపిస్తున్నందున, లాంగ్‌ పొజిషన్లున్న ట్రేడర్లు స్టాప్‌లాస్‌ కొనసాగించడం మేలు. 
  • అల్యూమినియం జూన్‌ కాంట్రాక్టు  రూ.234.05 కంటే కిందకు వస్తే రూ.227.05కు పడిపోవచ్చు. రూ.249.85 పైన కదలాడితే రూ.258.65 వరకు రాణించొచ్చు.  

ఇంధన రంగం

  • ముడి చమురు జూన్‌ కాంట్రాక్టు   రూ.6,300 కంటే దిగువన ట్రేడ్‌ కాకుంటే  రూ.6,678 వరకు పెరిగే అవకాశం ఉంటుంది. ఒకవేళ రూ.6,302 కంటే దిగువన ట్రేడయితే రూ.6,136; రూ.5,926 వరకు దిద్దుబాటు కావచ్చు. 
  • సహజవాయువు జూన్‌ కాంట్రాక్టు సానుకూలంగానే కనిపిస్తోంది. అయితే రూ.254.65 వద్ద నిరోధం ఎదురుకావచ్చు. ఈ స్థాయిని అధిగమిస్తే రూ.274.65 వరకు పెరిగే అవకాశం ఉంటుంది.

వ్యవసాయ ఉత్పత్తులు

  • పసుపు జూన్‌ కాంట్రాక్టుకు  రూ.18,617 వద్ద మద్దతు కనిపిస్తోంది. ఈ స్థాయిని కోల్పోతే రూ.17,262; రూ.16,485 వరకు దిద్దుబాటు కావచ్చు. అదేవిధంగా సానుకూల ధోరణిలో కదలాడితే    రూ.20,749 వద్ద నిరోధం ఎదురయ్యే అవకాశం ఉంది. దీనిని అధిగమిస్తే రూ.21,256; రూ.22,881 వరకు పెరగొచ్చు.
  • పత్తి క్యాండీ జూన్‌ కాంట్రాక్టు  రూ.57,056 కంటే కిందకు వస్తే రూ.56,733 వరకు పడిపోవచ్చు. రూ.58,826 కంటే పైన కదలాడితే రూ.59,373 వరకు రాణించే అవకాశం ఉంటుంది.

ఆర్‌ఎల్‌పీ కమొడిటీ అండ్‌ డెరివేటివ్స్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని