క్లెయిమ్‌ చేయని డిపాజిట్లు బ్యాంకుల్లో రూ.78,213 కోట్లు

బ్యాంకుల వద్ద 2024 మార్చి చివరకు క్లెయిమ్‌ చేయని (అన్‌క్లెయిమ్డ్‌) డిపాజిట్లు 26% పెరిగి రూ.78,213 కోట్లకు చేరాయని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) గురువారం వార్షిక నివేదికలో తెలిపింది.

Published : 31 May 2024 03:43 IST

ముంబయి: బ్యాంకుల వద్ద 2024 మార్చి చివరకు క్లెయిమ్‌ చేయని (అన్‌క్లెయిమ్డ్‌) డిపాజిట్లు 26% పెరిగి రూ.78,213 కోట్లకు చేరాయని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) గురువారం వార్షిక నివేదికలో తెలిపింది. 2023 మార్చి ఆఖరుకు ఈ మొత్తం రూ.62,225 కోట్లుగా ఉంది. సహకార బ్యాంకులతో పాటు వాణిజ్య బ్యాంకులు.. తమ ఖాతాదార్లు, పదేళ్లు అంతకంటే ఎక్కువ కాలం నుంచి క్లెయిమ్‌ చేయని డిపాజిట్లను ఆర్‌బీఐకు చెందిన డిపాజిటర్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ అవేర్‌నెస్‌ (డీఈఏ)కు బదిలీ చేస్తుంటాయి. అన్‌క్లెయిమ్డ్‌ డిపాజిట్లను సంబంధిత నామినీలు సులువుగా తెలుసుకునేందుకు వీలుగా ఉద్గమ్‌ (అన్‌క్లెయిమ్డ్‌ డిపాజిట్స్‌ గేట్‌వే టు యాక్సెస్‌ ఇన్ఫర్మేషన్‌) పోర్టల్‌ను ఆర్‌బీఐ తీసుకొచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని