ఏప్రిల్‌లో ఆర్‌బీఐ పసిడి కొనుగోళ్లు 5.6 టన్నులు

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ఈ ఏడాది ఏప్రిల్‌లో 5.6 టన్నుల పసిడి కొనుగోలు చేయడంతో, మొత్తం పసిడి నిల్వలు 827.7 టన్నులకు చేరాయని ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) వెల్లడించింది.

Published : 06 Jun 2024 03:09 IST

ముంబయి: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ఈ ఏడాది ఏప్రిల్‌లో 5.6 టన్నుల పసిడి కొనుగోలు చేయడంతో, మొత్తం పసిడి నిల్వలు 827.7 టన్నులకు చేరాయని ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) వెల్లడించింది. వివిధ దేశాల కేంద్ర బ్యాంకులన్నీ కలిపి ఏప్రిల్‌లో 33 టన్నుల పసిడి నిల్వలను జత చేసుకున్నాయని పేర్కొంది. మార్చిలో ఇవి నికరంగా 3 టన్నులే ఉన్నాయి. మన దేశ కేంద్ర బ్యాంక్‌ అయిన ఆర్‌బీఐ, ఈ ఏడాది జనవరి-మార్చిలో 24.1 టన్నుల పసిడిని కొనుగోలు చేసింది. గతంలో ఎన్నడూ ఇంతగా కొనలేదు. ప్రపంచంలో అత్యధికంగా పసిడి నిల్వలు ఉన్న దేశాల్లో అధికారికంగా భారత్‌ 10వ స్థానంలో ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని