మదుపర్ల ఖాతాల్లోకే నేరుగా చెల్లింపుల మొత్తం

సెక్యూరిటీలను అమ్మినప్పుడు, వచ్చే నగదు మొత్తాన్ని నేరుగా మదుపర్ల డీమ్యాట్‌ ఖాతాల్లోనే జమచేసే ప్రక్రియను తప్పనిసరి చేయాలని మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నిర్ణయించింది.

Published : 06 Jun 2024 03:13 IST

అక్టోబరు 14 నుంచి అమలు

దిల్లీ: సెక్యూరిటీలను అమ్మినప్పుడు, వచ్చే నగదు మొత్తాన్ని నేరుగా మదుపర్ల డీమ్యాట్‌ ఖాతాల్లోనే జమచేసే ప్రక్రియను తప్పనిసరి చేయాలని మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నిర్ణయించింది. అక్టోబరు 14 నుంచి ఇది అమల్లోకి వస్తుందని తెలియజేసింది. ప్రస్తుతం సెక్యూరిటీలకు సంబంధించిన చెల్లింపులను బ్రోకర్ల ఖాతాలో (పూల్‌ అకౌంట్‌) క్లియరింగ్‌ కార్పొరేషన్లు (సీసీలు) జమచేస్తున్నాయి. ఆ తర్వాత ఆ మొత్తాన్ని బ్రోకర్లు, సంబంధిత క్లయింట్ల డీమ్యాట్‌ ఖాతాలకు పంపిస్తుంటాయి. స్టాక్‌ ఎక్స్ఛేంజీలు, క్లియరింగ్‌ కార్పొరేషన్లు, డిపాజిటరీలతో విస్తృత సంప్రదింపుల అనంతరం.. క్లయింట్ల (మదుపర్ల) డీమ్యాట్‌ ఖాతాల్లోకే సీసీల ద్వారా నేరుగా చెల్లింపులు చేయించాలని సెబీ నిర్ణయించింది. ఇది అమల్లోకి వస్తే ఇక బ్రోకర్ల ఖాతాల్లోకి, ఖాతాదార్ల నగదు చేరదు. మార్జిన్‌ ట్రేడింగ్‌ ఫెసిలిటీ కింద చెల్లింపులు చేయని సెక్యూరిటీలను, కొనుగోలు చేసిన షేర్లను గుర్తించే సదుపాయాన్ని ట్రేడింగ్‌ సభ్యులు లేదా క్లియరింగ్‌ సభ్యుల కోసం సీసీలు అందుబాటులోకి తేవాల్సి ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని