రిటెయిల్‌ మదుపర్లకు ప్రోత్సాహకాలు

Eenadu icon
By Business News Desk Published : 28 Oct 2025 03:35 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

డెట్‌ ఇష్యూలకు అనుమతిపై సెబీ ఆలోచన

దిల్లీ: డెట్‌ ఇష్యూల విషయంలో సీనియర్‌ సిటిజన్లు, మహిళలు, సాయుధ దళ సిబ్బంది (పనిచేస్తున్న, పదవీ విరమణ పొందిన వారు, ఎక్స్‌సర్వీస్‌మెన్‌ భార్యలు), రిటెయిల్‌ మదుపర్ల వంటి నిర్దిష్ట విభాగాల మదుపర్లకు ప్రోత్సాహకాలు ఆఫర్‌ చేసేందుకు అనుమతులు ఇచ్చే అంశాన్ని సెబీ పరిశీలిస్తోంది. తద్వారా బాండ్‌ మార్కెట్లో రిటెయిల్‌ మదుపర్లను ప్రోత్సహించేందుకు, పబ్లిక్‌ డెట్‌ ఇష్యూలపై ఆసక్తి పెంచేందుకు వీలవుతుందని భావిస్తోంది. ప్రస్తుతం సెబీ నిబంధనల ప్రకారం.. ఇష్యూతో ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధమున్న ఏ వ్యక్తీ నగదు, సేవలు వంటి ప్రోత్సాహకాలు ఇవ్వడానికి వీలు లేదు. ఫీజు లేదా కమీషన్‌లో మినహాయింపు ఇవ్వొచ్చు. సంబంధిత నిబంధలను సవరించడం ద్వారా, నిర్దిష్ట మదుపర్ల విభాగాలకు అధిక కూపన్‌ రేటు లేదా డిస్కౌంటు ఇవ్వడానికి, ఇష్యూదార్లకు అనుమతులివ్వాలని ప్రతిపాదిస్తూ చర్చాపత్రాన్ని సెబీ విడుదల చేసింది.  సదరు ప్రోత్సాహకాలు అసలైన అలాటీలకే వర్తిస్తాయి. బాండ్ల బదిలీ/విక్రయానంతరం వర్తించవు. 

2022-23లో బాండ్ల జారీ రూ.19,168 కోట్లు కాగా, 2023-24లో రూ.8149 కోట్లకు తగ్గిన నేపథ్యంలో సెబీ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ప్రతిపాదనలపై ప్రజలు నవంబరు 17లోగా స్పందనలు తెలపొచ్చు.

అధిక విలువ డెట్‌ లిస్టెడ్‌ కంపెనీ (హెచ్‌వీడీఎల్‌ఈ)ల గుర్తింపునకు ఉద్దేశించిన పరిమితిని ప్రస్తుత రూ.1,000 కోట్ల నుంచి రూ.5,000 కోట్లకు పెంచుతూ సెబీ ప్రతిపాదించింది. దీంతో ఈ వర్గీకరణ కిందకు వచ్చే సంస్థల సంఖ్య 137 నుంచి 48కి పరిమితమైంది. నిబంధనల భారాన్ని తగ్గించి, సులభతర వాణిజ్యానికి వీలు కల్పించడమే ఈ ప్రతిపాదన ఉద్దేశం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు