ఆర్థిక వ్యవస్థ వృద్ధి బలంగానే

Eenadu icon
By Business News Desk Published : 28 Oct 2025 03:57 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

2025-26పై ఆర్థిక శాఖ అంచనా

దిల్లీ: అంతర్జాతీయంగా ఆర్థిక, వాణిజ్యపరమైన అనిశ్చితులు ఉన్నప్పటికీ.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి బలంగానే నమోదుకావొచ్చని ఆర్థిక శాఖ తాజాగా పేర్కొంది. ద్రవ్యోల్బణం తక్కువ స్థాయిల్లో ఉండటం, వడ్డీ రేట్ల కోత, సానుకూల వర్షపాతం, జీఎస్‌టీ రేట్ల తగ్గింపు వల్ల గిరాకీ పెరగడం ఇందుకు కారణమవుతుందని విశ్లేషించింది. 2025-26లో భారత వృద్ధిరేటు అంచనాలను ఐఎంఎఫ్‌ 6.4% నుంచి 6.5 శాతానికి; ఆర్‌బీఐ    6.6% నుంచి 6.8 శాతానికి పెంచడాన్ని ప్రస్తావించింది. మన ఉత్పత్తులపై ఆగస్టు చివరి నుంచి అమెరికా అధిక సుంకాలు వసూలు చేస్తున్నా,  జులై-సెప్టెంబరులో మన ఆర్థిక వ్యవస్థ వేగాన్ని అందుకోవడం విశేషమని తెలిపింది.

ఎగుమతి గమ్యస్థానాల్లో వైవిధ్యం.. 

జీఎస్‌టీ రేట్ల తగ్గింపుతో గిరాకీ మెరుగవ్వడం, పండగల నేపథ్యంలో వినియోగం పెరగడం వల్ల వివిధ కీలక సూచీలు సానుకూల సంకేతాలను ఇస్తున్నాయని వివరించింది. సేవల రంగ ఎగుమతుల్లో బలమైన వృద్ధితో పాటు భారత వాణిజ్య రంగ ప్రదర్శన మెరుగ్గానే ఉందని తెలిపింది. ఎగుమతుల గమ్యస్థానాల్లో వైవిధ్యతకు 2025 సెప్టెంబరు వాణిజ్య గణాంకాలు అద్దం పడుతున్నాయని వివరించింది. స్థూల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) పెరుగుతున్నాయనీ ఆర్థిక శాఖ వివరించింది. జీఎస్‌టీ రేట్ల తగ్గింపు సహా ఇటీవలి విధాన నిర్ణయాలు వినియోగం పెరిగేందుకు తోడ్పడుతూనే.. ద్రవ్యోల్బణం తగ్గేందుకు ఉపకరిస్తాయని విశ్లేషించింది. 2025-26లో మొత్తం మీద ధరలు అదుపులోనే ఉండొచ్చని అంచనా వేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని