Gold price: పెరిగిన బంగారం ధర.. రూ.69 వేలు చేరువలో

Gold price today: బంగారం ధర మళ్లీ పెరిగింది. అంతర్జాతీయంగా పసిడి ధరలకు రెక్కలు రావడంతో దేశీయంగానూ ధరలకు పైకి ఎగబాకాయి.

Updated : 21 Mar 2024 19:02 IST

హైదరాబాద్‌: పసిడి ధరకు (Gold price) మరోసారి రెక్కలు వచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్లో బంగారానికి డిమాండ్‌ ఏర్పడడంతో దేశీయంగానూ ధర పెరిగింది. 10 గ్రాముల మేలిమి (24 క్యారెట్ల) పసిడి ధర హైదరాబాద్‌లో రూ.68,800పైనే (ట్యాక్సులతో కలిపి) పలుకుతోంది. ఆర్నమెంట్‌కు వినియోగించే 22 క్యారెట్ల బంగారం రూ.64 వేల వరకు ఉంది. బుధవారంతో పోలిస్తే దాదాపు ఒకే రోజు వెయ్యి రూపాయల మేర ధర పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 2208 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఔన్సు వెండి ధర 25.51 డాలర్ల వద్ద కొనసాగుతోంది. వడ్డీ రేట్లలో ఈ ఏడాది మూడు సార్లు కోత ఉంటుందని ఫెడ్‌ సంకేతాలు ఇవ్వడంతో డాలర్‌లో అమ్మకాలు వెల్లువెత్తాయి. ఇది పసిడి డిమాండ్‌కు కారణమైందని బులియన్‌ ట్రేడింగ్‌ వర్గాలు చెబుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని