Gold price: తగ్గిన బంగారం, వెండి ధరలు.. కారణం ఇదే..

Gold price: బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయంగా గిరాకీ తగ్గడంతో అంతర్జాతీయంగా వీటి ధరలు దిగివచ్చాయి.

Published : 23 Apr 2024 21:02 IST

Gold price | దిల్లీ: బంగారం కొనుగోలుదారులకు గుడ్‌న్యూస్‌. ఇన్నాళ్లూ భారీగా పెరిగిన బంగారం ధరకు (Gold price) కాస్త బ్రేక్‌ పడింది. అంతర్జాతీయంగా గిరాకీ తగ్గడంతో పసిడి ధర దిగి వచ్చింది. అంతర్జాతీయ విపణిలో బంగారం ధర క్షీణించడంతో దేశీయంగా వెయ్యి రూపాయలకు పైనే తగ్గింది. మంగళవారం రాత్రి 8 గంటల సమయానికి బులియన్‌ మార్కెట్లో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి (24 క్యారెట్లు) ధర రూ.74,300గా (పన్నులు కలుపుకొని) ఉంది. వెండి కిలో ధర సైతం రూ.2 వేల వరకు తగ్గింది. 83,300 వద్ద కొనసాగుతోంది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర ఔన్సు 2322 డాలర్లుగా ఉంది. ఒక్కరోజులోనే దాదాపు 50 డాలర్లకు పైగా తగ్గింది.

పశ్చిమాసియాలో ఇరాన్‌- ఇజ్రాయెల్‌ మధ్య ఘర్షణలు ఇటీవల పసిడి ధరలకు రెక్కలు రావడానికి కారణమయ్యాయి. దీంతో సురక్షిత పెట్టుబడి సాధనంగా భావించి బంగారంవైపు మదుపరులు దృష్టి సారించారు. ప్రస్తుతం ఘర్షణలు తగ్గుముఖం పట్టడం, అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ మరికొంత కాలం పాటు అధిక వడ్డీ రేట్లను కొనసాగించే అవకాశాలు కనిపిస్తుండడంతో పసిడికి గిరాకీ తగ్గింది. రిస్క్‌తో కూడిన పెట్టుబడిన సాధనాల వైపు మదుపరులు పెట్టుబడులు మళ్లిస్తుండడం, గరిష్ఠాల వద్ద లాభాల స్వీకరణకు ట్రేడర్లు మొగ్గు చూపడంతో బంగారం ధర తగ్గడానికి కారణమని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీలో సీనియర్‌ అనలిస్ట్‌ సౌమిల్‌ గాంధీ పేర్కొన్నారు.

గమనిక: బంగారం ధరల్లో ప్రాంతానికి ప్రాంతానికీ మధ్య వ్యత్యాసం ఉంటుంది. వాస్తవ ధరల కోసం మీ దగ్గర్లోని బంగారం వర్తకుల్ని సంప్రదించండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని